పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి | Red sandalwood smugglers attack police | Sakshi
Sakshi News home page

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

Published Mon, Sep 26 2016 5:52 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి - Sakshi

పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి

తిరుపతి: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. సోమవారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు స్మగ్లర్లు కంటపడ్డారు.  లొంగిపొమ్మని హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా వారు.. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఓ రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు.

ఈ సంఘటన ముంగిలిపట్టు పరిధిలోని అక్కన్న దొన ఏరియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement