పోలీసులకు చిక్కిన ఎర్ర స్మగ్లర్లు
కమల్‌కిషోర్, మీర్జా, షరీఫ్, స్వామి అరెస్టు
ముగ్గురిపై జిల్లాలో 75 కేసులు
చిత్తూరు (అర్బన్) :చిత్తూరు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ రెడ్‌లో ముగ్గురు ప్రధాన అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేశారు. జిల్లాలోని బంగారుపాళ్యం, పీలేరు, చిత్తూరు వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో ఆదివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చిత్తూరు నగరానికి చెందిన కమల్‌కిషోర్, బెంగళూరుకు చెందిన మీర్జా, సఫ్దర్ షరీఫ్, అలాగే బంగారుపాళ్యానికి చెంది న మేస్త్రీ స్వామి పట్టుబడ్డారు. ఈ ముగ్గురిపై జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో 75 కేసులు నమోదయ్యాయి. నిందితుల నుంచి మూడు కార్లు, 28 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.28 లక్షలు ఉంటుందని ఓఎస్‌డీ రత్న తెలిపారు. నగరంలోని పోలీసు పెరెడ్ గ్రౌండ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆమె ఈ వివరాలను వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీలు గిరిధర్, లక్ష్మీనాయుడు, దేవదాసు, సీఐలు మహేశ్వర్, నిరంజన్‌కుమార్ పాల్గొన్నారు.
ఆరుగురు ఎర్ర స్మగ్లర్లపై ‘పీడీ’ నమోదుకు ప్రతిపాదనలు
ఎర్రచందనం అక్రమ రవాణాలో అరెస్టయిన ఆరుగురు స్మగ్లర్లపై ప్రివెంటివ్ డిటెక్టివ్ (పీడీ) యాక్టు కింద కేసులు నమోదు చేయడానికి జిల్లా పోలీసు శాఖ ప్రతిపాదనలు పంపింది. సోమవారం చిత్తూరు ఓఎస్‌డీ రత్న దీనిపై మాట్లాడుతూ ఆరుగురు స్మగ్లర్లపై పీడీ నమోదు చేయడానికి కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. ఈనెలాఖరులోపు అనుమతి వస్తుందని, అనంతరం స్మగ్లర్లను పీడీ యాక్టు కింద కడప, రాజమండ్రి జైలుకు తరలిస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో పీడీ యాక్టు కింద 44 మందిని అరెస్టు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.
కమల్‌కిషోర్: ఇతన్ని కమల్ (32) అని కూడా పిలుస్తుంటారు. చిత్తూరు లోని రామ్‌నగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి టీఏ.పద్మనాభం కుమారుడు. ఎంబీఏ వరకు చదువుకున్న ఇతను పలు సాఫ్ట్‌వేర్ కంపెనీ ల్లో పనిచేశాడు. 2011 నుంచి ఎర్రచందనం రవాణా చేస్తున్నాడు. చిత్తూరుకు చెందిన టీడీపీ నాయకుడు వసంత్‌కుమార్, తుమ్మింద పాళ్యం గౌస్‌తో సంబంధాలున్నాయి. ఇప్పటి వరకు వంద టన్నుల వరకు ఎర్రచందనం దుంగల్ని ఎగుమతి చేసి రూ.10 కోట్ల వరకు సంపాదించాడు. బెంగళూరులో ఇతను, స్మగ్లర్ మీర్జా కలిసి ఓ పబ్‌ను నడుపుతున్నారు.
మీర్జా: మీర్జాబేగ్, ఖాస్ (39) అనే పేర్లతో కూడా ఇతన్ని పిలుస్తారు. ఎర్రచందనం వ్యాపారంలో మోస్ట్‌వాంటెడ్ కింగ్ పిన్ మీర్జా. మూడో తరగతి వరకు చదువుకున్న మీర్జా గతంలో ద్విచక్ర వాహనాల వ్యాపారం చేసేవాడు. 2013 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణాలో ఉన్నాడు. ఇతనిపై జిల్లాలో 30 కేసులు ఉన్నాయి. జిల్లా నుంచి 30 టన్నుల వరకు ఎర్రచందనం రవాణా చేసి రూ.3 కోట్ల వరకు సంపాదించాడు.
స్వామి: బంగారుపాళ్యంకు చెందిన పేరు స్వామి (32) 2009 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతను మేస్త్రీగా వ్యవహరిస్తున్నా డు. కమల్‌కిషోర్, మీర్జాను పట్టుకోవడానికి ఆపరేషన్ రెడ్‌లో ఉన్న సీఐలు బెంగళూరులోని ఓ ప్రాంతంలో భిక్షగాళ్లుగా గెటెప్ వేసుకున్నారు. మరో అధికారి పబ్‌లో సరదాగా అమ్మాయిలతో గడపడానికన్నట్లు పిల్ల జమిందార్ వేషం కట్టారు. ఇంకొకరు క్యాబ్ డ్రైవర్‌గా వ్యవహరించారు. ప్రాణాలకు తెగించి ఈ ముగ్గు రు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరికి త్వరలోనే ఎస్పీ చేతు లు మీదుగా రివార్డులు అందజేయనున్నట్టు ఓఎస్‌డీ రత్న తెలిపారు.
షరీఫ్: బెంగళూరులోని భనశంకరి ప్రాంతానికి చెందిన సఫ్దర్ షరీఫ్ (29) రెండో తరగతి వరకు చదువుకున్నాడు. గతంలో స్పిరిట్ వ్యాపారం చేసేవాడు. 2013 నుంచి ఎర్రచంద నం అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇతనికి ఆంధ్రాతో పాటు కర్ణాటక, ముం బయి, ఢిల్లీకి చెందిన స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. ఇతను ఇప్పటి వరకు వంద టన్నుల ఎర్రచందనం దుంగలను మన జిల్లా నుంచి తెప్పిం చుకుని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేశాడు. ఇతనిపై జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో 15 కేసులు న్నాయి. ఈ రెండేళ్ల కాలంలో స్మగ్లింగ్ ద్వారా రూ.10 కోట్లు సంపాదించాడు.