ఇద్దరు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్ | Two red smugglers arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్

Published Thu, Sep 3 2015 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 8:37 AM

ఇద్దరు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్

ఇద్దరు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్

బంగారుపాళెం : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు డీఎస్పీ శంకర్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారుపాళెం మండలం మాధవనగర్ వద్ద ఆపకుండా వెళుతున్న టాటా ఎక్స్‌ఆన్ వాహనాన్ని ఎస్‌ఐలు ఉమామహేశ్వర్‌రావు, దిలీప్‌కుమార్, సిబ్బంది పట్టుకున్నారన్నారు.

ఇద్దరు పరారు కాగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వాహనంలో మూడు ఎర్రచందనం దుంగలు, రెండు ఇనుపరాడ్లు, రెండు కత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వ్యక్తుల్లో కృష్ణగిరికి చెందిన షణ్ముగం, గోవిందరాజులు ఉన్నట్లు తెలిపారు. వాహన డ్రైవర్ శక్తివేల్, ప్రధాన స్మగ్లర్ మున్నాబాయ్ పరారైనట్లు చెప్పారు. నిందితులను కోర్టుకు హాజరు పరచనున్నట్లు పేర్కొన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement