కోల్‌కతా: భారత్–బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో బంగ్లాదేశ్‌కు చెందిన ఒక స్మగ్లర్ మృతి చెందాడు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్డా జిల్లా గోపాల్‌నగర్ సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్మగ్లర్ కత్తితో జరిపిన దాడిలో జవాను ఒకరు స్వల్పంగా గాయపడ్డారని బీఎస్‌ఎఫ్ తెలిపింది. రాత్రి 10 గంటల సమయంలో భారత్, బంగ్లాదేశ్‌లకు చెందిన సుమారు 12 మందితో కూడిన స్మగ్లర్ల బృందం సరిహద్దు కంచెకు సమీపంలో సంచరిస్తున్నట్లు జవాన్లు పసిగట్టారు. పట్టుకునేందుకు ప్రయత్నించగా తమ వద్ద ఉన్న దగ్గుమందు ఫెన్సిడైల్ బాటిళ్లను కంచె వద్ద పడేసి పరుగు తీశారు. ఒక బంగ్లాదేశీ స్మగ్లర్ మాత్రం జవానుపై కత్తితో దాడి చేశాడు. దీంతో జవాను ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ సందర్భంగా మత్తు కోసం వాడే 75 బాటిళ్ల ఫెన్సిడైల్‌తోపాటు ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: 14 కేజీల బంగారం మాయం..
Comments
Please login to add a commentAdd a comment