స్మగ్లర్ను పట్టుకునేందుకు నదిలోకి దూకిన జవాను | BSF jawan drowns while chasing smuggler in West Bengal | Sakshi
Sakshi News home page

స్మగ్లర్ను పట్టుకునేందుకు నదిలోకి దూకిన జవాను

Published Tue, Sep 15 2015 8:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

BSF jawan drowns while chasing smuggler in West Bengal

బాలూర్ఘాట్: దేశ రక్షణ విషయంలో భారత జవాన్లు ఎంతటి ధైర్య సాహసాలతో ఉంటారో చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. ఓ స్మగ్లర్ను పట్టుకునే క్రమంలో భారత జవాను వీర మరణం పొందాడు. నదిలో దూకి పారిపోతున్న స్మగ్లర్ను బంధించేందుకు తాను నదిలో దూకి కొంత దూరం ఈదిన తర్వాత మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. ఆ బీఎస్ఎఫ్ జవాను చేసిన సాహసం చూసి ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు.

బంగ్లాదేశ్కు భారత్కు ఉన్న సరిహద్దు వద్ద ఓ నదీ ప్రవాహం ఉంది. బంగ్లా సరిహద్దు నుంచి భారత భూభాగంలోకి ప్రవేశిస్తున్న ఓ చొరబాటుదారుడిని గుర్తించిన సరిహద్దు రక్షణ దళం(బీఎస్ఎఫ్)కు చెందిన సెక్టార్ కమాండర్ ప్రశాంత్ రాయ్ అతడిని వెంబడించాడు. ఈ క్రమంలో అతడు నదిలో దూకి పారిపోయే ప్రయత్నం చేస్తుండటంతో తాను కూడా నదిలో దూకి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement