గంజాయి రవాణాకు కొత్త ఎత్తుగడ
పోలీసులకు సమాచారం అందకుండా సెల్ సేవలకు అంతరాయం
సీలేరు: గంజాయి రవాణాకు స్మగ్లర్లు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. ఎలాగైనా కోట్లకు పడగెత్తాలనే ఉద్దేశంతో అనేక తప్పుడు పనులకు పాల్పడుతున్నారు. వారు పండించిన గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా మైదాన ప్రాంతానికి తరలించే క్రమంలో ఏజెన్సీలో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. గంజాయి రవాణా చేస్తున్న సమయంలో జీకేవీధి మండలం మారుమూల గ్రామాల్లో సెల్ సేవలకు అంతరాయం కలిగిస్తున్నారు. గంజాయి రవాణాలో పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారన్న నెపంతో ఓఎస్‌డీ కేబుల్‌ను కాల్చివేయడం, గొడ్డలితో నరికేయడం వంటి పనులకు పాల్పడుతున్నారు. మారుమూల గ్రామాల నుంచి తరలిస్తున్న గంజాయి ఇటీవల వివిధ ప్రాంతాల్లో పెద్దఎత్తున పోలీసులకు పట్టుబడింది. ఈ కేసుల్లో పలువురు జైలు పాలయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం చేరకుండా గంజాయి స్మగ్లర్లు సెల్ సిగ్నల్‌కు అంతరాయం కలిగించి గంజాయి తరలిస్తున్నారు. జీకేవీధి నుంచి సీలేరు వరకు కొన్ని చోట్ల మార్గమధ్యలో వంతెనల దగ్గర ఓఎఫ్‌సీ కేబుల్ పైనే ఉండటంతో ఈ పనులకు పాల్పడుతున్నారు.
సీలేరులో బుధవారం దారకొండ సమీపంలో కొందరు వ్యక్తులు ఓఎఫ్‌సీ కేబుల్‌ను వెదురుకర్రలతో తగులబెట్టారు. దీంతో రెండు రోజులపాటు సీలేరులో సెల్‌సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ, ప్రైవేటు, జెన్‌కో కార్యాలయాల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఇది గంజాయి స్మగ్లర్ల పనే అని గిరిజనులు చెబుతున్నారు. కేబుల్ వైర్లు ఎక్కడ తె ంపారో తెలుసుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులకు 3 రోజులు పడుతుండటంతో సెల్ సేవలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని ఈ ప్రాంత వినియోగదారులు కోరుతున్నారు.
కేబుల్ వైర్లపై స్మగ్లర్ల వేటు!
Published Fri, Feb 19 2016 11:20 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM
Advertisement
Advertisement