శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండున్నర కేజీల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో రెండున్నర కేజీల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం దుబాయి నుంచి శంషాబాద్‌కు వచ్చిన ఏయిర్ ఇండియా విమానంలో డీఆర్‌ఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపారు.
ఈ తనిఖీల్లో విలువైన బంగారం దొరికినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎవరో గుర్తు తెలియని స్మగ్లర్లు బంగారాన్ని వదిలివెళ్లి ఉంటారని వారు భావిస్తున్నారు.