14 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌ | 14 redsander smugglers arrested in kadapa district | Sakshi
Sakshi News home page

14 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

Published Wed, May 10 2017 12:57 PM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

14 redsander smugglers arrested in kadapa district

కడప: జిల్లాలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో 14 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 627 కిలోల బరువున్న 41 ‘ఎర్ర’  దుంగలతో పాటు 10 సెల్‌ఫోన్లు, 2 కార్లు, ఓ ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఓఎస్‌డీ సత్య ఏసుబాబు వివరాలు తెలిపారు. పట్టుబడిన వారిలో అంతర్జాతీయ స్మగ్లర్‌ సాహూల్‌భాయ్‌ ప్రధాన అనుచరుడు శివలింగం శ్రీధర్‌తో పాటు అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ ఇక్రం భాయ్‌ ఉన్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement