
సాక్షి, తిరుపతి: గత కొంతకాలంగా యథేచ్చగా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన నలుగురు స్మగ్లర్లు తిరుచానూరు సమీపంలోని చైతన్యపురంలోని ఓ ఇంట్లో దాగిఉన్నారని పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌పోర్స్ అధికారులు లైవ్ ఆపరేషన్ చేపట్టారు. మొదట భారీగా సిబ్బందిని మోహరించి స్మగ్లర్లు ఉన్న ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో భయాందోళనకు గురైన స్మగ్లర్లు సిబ్బందిపై బాటిల్స్ విసిరారు. అంతేకాకుండా ఇంటిలోపలికి ప్రవేశించిన సిబ్బందిపై కత్తులతో దాడికి యత్నించారు. స్మగ్లర్ల దాడిని చాకచక్యంగా ప్రతిఘటించిన సిబ్బంది, వారిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment