నేరస్తులను గుర్తించడంలో విఫలమవుతున్న పోలీసులు
జల్సాలకు అలవాటు పడ్డ యువత డబ్బు సంపాదనే ధ్యేయంగా అక్రమ మార్గాల వైపు
మొగ్గుచూపుతోంది. ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించి పెలైట్లుగాను
డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాల వైపు మరలుతున్నారు. గతంలో జరిగిన సంఘటనలే
కాకుండా ఇటీవల పోలీసు అరెస్టుల్లో కూడా యువకుల పాత్రతో పాటు వారికి స్మగ్లర్లు
అందిస్తున్న డ్రగ్స్ కూడా వెలుగులోకి వస్తున్నాయి.
సాక్షి, చిత్తూరు : చైనాతో పాటు ఇతర దేశాలకు చెందిన స్మగ్లర్లు భారతదేశానికి బ్రౌన్ షుగర్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలను దిగుమతి చేయిస్తున్నారు. అయితే మొదట వీటి గురించి తెలియని యువకులు కొందరి మాయలో పడుతున్నారు. 2014 అక్టోబర్ 12తేదీన బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్తూ చెన్నై విమానాశ్రయంలో పట్టుబడ్డ పీలేరుకు చెందిన ఆనంద్ విషయంలో నార్కో అనాలసిస్ విభాగం పలు పరీక్షలు చేసి చిత్తూరు జిల్లా పోలీసులకు సమాచారం అందించినా అసలు నిందితులను పట్టుకోలేకపోయారు. ఆనంద్ అనే వ్యక్తి ఆరోతరగతి వరకు చదువుకుని గొర్రెల కాపరిగా ఉంటూ, గిట్టుబాటు కాక ఆ గొర్రెలను అమ్ముకుని వచ్చిన డబ్బుతో కువైట్‌కు వెళ్లేందుకు బయలుదేరాడు.
అతని సమీప గ్రామస్తుడైన వ్యక్తి వచ్చి పది గోధుమ పిండి పొట్లాలని చెప్పి బ్యాగు ఇచ్చి దాంతోపాటు ఆనంద్‌ను చెన్నై ఎయిర్‌పోర్టులో వదిలి వచ్చాడు. ఎయిర్‌పోర్టులోకి వెళ్లిన ఆనంద్ కస్టమ్ అధికారుల తనిఖీల్లో బ్రౌన్ షుగర్ తరలిస్తున్నట్లు బయటపడింది. అయితే నేటికీ ఆనంద్ విడుదల కాకపోగా దీనికి సంబంధించిన వ్యక్తులను అరెస్టు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. అయితే ఇదే కేసుకు సంబంధించి మదనపల్లెకు చెందిన ఛాయాదేవి అనే మహిళకు కూడా సంబంధమున్నట్లు, నైజీరియాలో ఆమె పట్టుబడట్లు కూడా అప్పుడు వార్తలొచ్చాయి. అయితే మదనపల్లె పోలీసులు ఆమె పాస్‌పోర్టును, తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విచారణలో ఛాయాదేవికీ, ఆ కేసుకు ఎటువంటి సంబంధం లేదని మదనపల్లె టూ టౌన్ పోలీసులు తేల్చారు.
అయితే నిరుద్యోగ యువకులు మాత్రం మాదకద్రవ్యాల ముఠా చేతుల్లో సమిధులవుతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా సమాచారాన్ని ఏదో ఒక విధంగా తెలుసుకుంటున్నా, మాదకద్రవ్యాల సమాచారం సేకణలో పోలీసులు విఫలమవుతున్నారు. దుబాయ్, చెన్నై, థాయ్‌లాండ్, నేపాల్‌లకు చెందిన పలువురు అంతర్జాతీయ స్మగ్లర్ల విచారణలో వారు తమ దేశాలకు ఎర్రచందనం తెప్పించుకోవడంతో పాటు ఎర్రచందానాన్ని పంపుతున్న ఇండియాకు మాదకద్రవ్యాలను పంపుతున్న ట్లు పోలీసులు సమాచారాన్ని రాబట్టగలిగారు. అయి తే చెన్నై ఎయిర్‌పోర్టు సంఘటన జరిగి సంవత్సరం దాటుతున్నా కేసు పురోగతి సాధించింది లేదు.
మాదకద్రవ్యాల ఉచ్చులో యువత
Published Sat, Oct 17 2015 3:29 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement