భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం | Possession of huge redwood dump | Sakshi
Sakshi News home page

భారీ ఎర్రచందనం డంప్ స్వాధీనం

Published Mon, Oct 12 2015 7:06 PM | Last Updated on Sat, Sep 29 2018 5:47 PM

Possession of huge redwood dump

కర్నాటక రాష్ట్రంలో అక్రమంగా నిల్వ చేసిన రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగల్ని చిత్తూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలతో పాటు ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు.

ఆదివారం బంగారుపాళ్యం, మదనపల్లె టూటౌన్ పోలీసు స్టేషన్ ప్రాంతాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరు ఇచ్చిన సమాచారంతో కర్నాటక రాష్ట్రం దొడ్లబళ్లాపూర్, కడనూర్ గ్రామంలో అంజాద్ కు చెందిన మామిడి తోటలో మూడు టన్నుల ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు.

అయితే పోలీసుల జాడ పసిగట్టిన అంజాద్ పారిపోయినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో చిత్తూరు నగరంలోని జాన్స్‌గార్డెన్‌కు చెందిన మహ్మద్ అల్తాఫ్ హుస్సేన్ (36), తమిళనాడు క్రిష్ణగిరి జిల్లా ఉత్తస్‌గారై తాలూకా కీలమత్తూరుకు చెందిన ఎస్.అరుల్ (25), ఎస్.శరవన (22)లు ఉన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement