వాహనాలను తనిఖీ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బంది
తిరుపతి సిటీ: ఎర్ర స్మగ్లర్లు శ్రీవారి భక్తుల ముసుగులో కొండలోకి ప్రవేశిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఒక దశలో స్మగ్లర్లు తమ వద్ద ఉన్న ఆయుధాలు, రాళ్లతో దాడులకు దిగుతున్నారు. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి కొందరిని అదుపులోకి తీసుకుంటున్నారు. టాస్క్‌ఫోర్స్ ఐజీ మాగంటి కాంతారావు ఆదేశాల మేరకు ఆర్‌ఐ భాస్కర్ తన సిబ్బందితో కలిసి శనివారం రాత్రి కూంబింగ్ చేపట్టారు. ఆదివారం ఉదయం నరసింగాపురం బ్రిడ్జి నుంచి లోనికి వెళ్లే మార్గంలో స్మగ్లర్ల రాకను పసిగట్టారు. సిబ్బంది అప్రమత్తమై వేర్వేరుగా విడిపోయి ముళ్లపొదల్లో మాటువేశారు. ఏడుగురు స్మగ్లర్లపై మూకుమ్మడిగా దాడి చేశారు.
స్మగ్లర్లు తమ వద్ద ఉన్న ఆయుధాలు, నిత్యావసర సరుకులు పారవేసి పారిపోయారు. వారిలో తమిళనాడు వేలూరు జిల్లా తిరుపత్తూరు పుదురునాడుకు చెందిన అలిగేషన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా శ్రీవారి భక్తుల ముసుగులో అడవిలోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ వెంకటరమణ, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్‌ఆర్‌వో ప్రసాద్ పరిశీలించారు. స్మగ్లర్లు అడవిలోకి వెళ్లకుండా కట్టడి చేయడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని టాస్క్‌ఫోర్స్ ఐజీ కాంతారావు, ఎస్పీ రవిశంకర్ ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment