
సాక్షి, విజయవాడ: మత్తు పదార్థాలను రవాణా చేసే స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలలకు డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల ఆట కట్టిస్తామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి విద్యార్థులు తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డీజీపీ సూచించారు.మత్తు పదార్థాల రవాణాను నిరోధించడానికి దక్షిణాది పోలీసులు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్ డాటా ద్వారా గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాల మధ్య సమన్వయ చర్చల ద్వారా మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణాను నివారిస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment