నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 120 కిలోల క్లోరో హైడ్రేట్, 8 కిలోల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులోభాగంగా పోలీసులు తమదైన శైలిలో వారిని దర్యాప్తు చేస్తున్నారు.