
రాజస్థాన్ నుంచి ఒంటెల అక్రమ రవాణా
రాజస్థాన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఒంటెలను యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నారు. శుక్రవారం కర్ణాటక సరిహద్దులో ఉన్న రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బొప్పునారం
రంగారెడ్డి జిల్లాలో పట్టుబడిన 100కు పైగా ఒంటెలు
బంట్వారం: రాజస్థాన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఒంటెలను యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్నారు. శుక్రవారం కర్ణాటక సరిహద్దులో ఉన్న రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బొప్పునారం సమీపం నుంచి 100కు పైగా ఒంటెలను తరలిస్తుండగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పదిమంది కూలీలు వీటిని అటవీ మార్గంలో తీసుకెళ్తున్నారు. ఈ విషయంపై పీపుల్ ఫర్ ఎనిమల్ సొసైటీ సభ్యుల నుంచి డీజీపీ, ఎస్పీలకు సమాచారం అందింది. వారి ఆదేశం మేరకు స్థానిక పోలీసులు ఒంటెలను అడ్డుకున్నారు.
స్మగ్లర్లు తాండూరు మీదుగా హైదరాబాద్, ఏపీలోని కడపకు వాటిని తరలిస్తున్నట్టు తెలిసింది. పశు వైద్యాధికారులు ఒంటెలను పరీక్షించగా.. దాదాపు 90శాతం మేరకు అవి ఆరోగ్యంగానే ఉన్నట్లు వారు నిర్ధారించారు. ఈ నెల 6న రంజాన్ మాసం ప్రారం భం కానున్న నేపథ్యంలో వాటిని వధించేందుకు తీసుకెళ్తున్నట్టు సమాచారం.