
విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఏజెన్సీలో గంజాయి స్మగ్లర్లు బరితెగించారు. లంబసింగి ఘాట్‌రోడ్డులో పోలీసులపైకి స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. భారీ ఎత్తున గంజాయిని నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇప్పటికే పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు నల్లగొండ నుంచి విశాఖ ఏజెన్సీ ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. ఘటనా స్థలానికి నర్సీపట్నం నుంచి పోలీసు బలగాలను తరలించారు.