‘గుప్’ చుప్! | Transportation of marijuana and transported to the dunes harboring the district headquarters | Sakshi
Sakshi News home page

‘గుప్’ చుప్!

Published Thu, Nov 17 2016 1:09 AM | Last Updated on Mon, Sep 17 2018 6:20 PM

‘గుప్’ చుప్! - Sakshi

‘గుప్’ చుప్!

నిజామాబాద్ క్రైం : జిల్లా కేంద్రం అడ్డాగా గంజాయి రవాణా గుట్టుగా రవాణా అవుతోంది. భారీ స్థారుులో మహారాష్ట్రకు స్మగ్లర్లు సరఫరా చేస్తూ రూ.కోట్లు సంపాదిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలపై పోలీసుల నిఘా కరువవడంతో గంజారుు రవాణా సాఫీగా సాగుతోంది. బస్టాండ్, రైల్వేస్టేషన్, జిల్లా సరిహద్దులో చెక్‌పోస్టుల మీదుగా గంజారుు రవాణా అవుతుందని పోలీసులకు సమాచారం వస్తే తప్పా స్పందించడం లేదు. మాములు సమయాల్లో ఈ ప్రాంతాలపై గట్టి నిఘా వేయలేక పోతున్నారు. ఫలితంగా గంజారుు రవాణాకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. జిల్లా కేంద్రానికి చెందిన కొందరు స్మగ్లర్లు తమ అనుయాయులకు డబ్బు ఆశచూపి వారితో గంజారుు రవాణా చేరుుస్తున్నట్లు సమాచారం.

గంజారుు రవాణపై నిఘా పెట్టిన కొంతమంది పోలీసులు తమకు తెలిసి తెలియనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నారుు. గంజా రుు రవాణాకు రోడ్డు, రైల్వే మార్గాలు అనుకూలంగా ఉండటంతో స్మగ్లర్లు సులువుగా గంజారుుని జిల్లా దాటిస్తున్నారు. ఒరిస్సాలో పండించే శీలావతి గంజారుుకి మహారాష్ట్రలో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో స్మగ్లర్లు ఎక్కువగా మహా రాష్ట్రకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అరుుతే మహారాష్ట్రకు గంజారుు రవాణా చేసేందుకు ఏ రైలు అరుుతే పోలీసులకు అనుమానం రాదో ఆ రైలు ద్వా రానే గంజారుు జిల్లా దాటిస్తున్నారు.

రోడ్డు ద్వారా అనుమానం రాని వాహనాలలో గంజారుు రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఖరీదైన వాహనాలను గంజారుు రవాణాకు ఉపయోగిస్తుండటంతో అట్టి వాహనాలు సులువుగా చెక్‌పోస్టులు దాటుతున్నారుు. ఖరీదైన వాహనాన్ని చెక్‌పోస్టులో సిబ్బంది చూసీచూడనట్లుగా వదిలేస్తుండటంతో స్మగ్లర్లకు ఈ వాహనాలు కలిసివస్తున్నారుు. మూడు నెలలుగా గమనిస్తే గంజారుు కేసులు పోలీస్, ఎకై ్సజ్‌శాఖ, రైల్వే పోలీస్‌స్టేషన్‌లో ఒక్కటి నమోదు కాకపోవటం చూస్తుంటే గప్ చుప్‌గా గంజారుు కొనసాగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.

డబ్బు ఆశ చూపి..
గంజారుు స్మగ్లర్లు నిరుద్యోగ యువతను, పేదరికంతో బాధపడుతున్న మహిళలకు డబ్బు ఆశ చూసి వారితో గంజారుు స్మగ్లింగ్ చేరుుస్తున్నట్లు సమాచారం. ఒరిస్సాలో కిలో గంజారుు రూ.1000 తీసుకొచ్చి మహారాష్ట్రలో రూ. 10 వేలకు విక్రరుుస్తున్నారు. ఇలా ఒక కిలోకు రూ. 9 వేలు లాభం వస్తుండటంతో గంజారుు రవాణా చేరుుంచే వారికి రూ. 2 వేల నుంచి రూ. 3 వేలు ఇస్తున్నారు. అక్రమ సంపాదన బాగుండటంతో ఒకసారి గంజారుు రవాణాకు అలవాటు పడిన వారు ఇదే వృత్తిగా భావిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఒరిస్సా నుంచి జిల్లాకు గంజారుు రవాణా చేరుకునే సరికి మూడు సార్లు చేతులు మారుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా యువకులు పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా ల్యాప్‌టాప్ బ్యాగ్‌లలో దాదాపు అరుుదు కిలోల వరకు గంజారుు ప్యాకెట్లను వేసుకుని జిల్లాను దాటిస్తున్నారు. పోలీసుల కంటికి వీరు మామూలు విద్యార్థులుగా కనిపిస్తుండటంతో వారిపై పోలీసులకు అనుమానం కలగటంలేదు. గతంలో కామారెడ్డి బాన్సువాడ రహదారిలో గంజారుు రవాణా చేస్తూ గాంధారి పోలీసులకు చిక్కిన వారిలో యువకులే ఉండటం విశేషం.

గంజారుు పండే ప్రాంతాలు
గతంలో జిల్లాలో కొన్ని ప్రాంతాలు గంజారుు పంటలకు పెట్టింది పేరుగా ఉండేది. నిజామాబాద్ మండలం మంచిప్ప, బైరాపూర్ తండా, ఎల్లమ్మకుంట, కాల్పొల్ తండా, డిచ్‌పల్లి, సిరికొండ, ధర్పల్లి, భీంగల్.. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, బాన్సువాడ మండలాల్లోని మారుమూల గ్రామాల్లో గంజారుు సాగయ్యేది. పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అధికారులు వెళ్లనటువంటి ప్రాంతాల్లో గంజారుు సాగు చేసేవారు. అక్కడ పండించిన పంటలు రవాణా చేస్తుంటే ఎకై ్సజ్ లేదా పోలీసులకు సమాచారం వస్తే పట్టుకునేవారు. లేదంటే  స్మగ్లర్లు గంజారుును మహారాష్ట్రకు సులభంగా తరలించి సోమ్ము చేసుకునేవారు. దీంతో ఎకై ్సజ్‌శాఖ అధికారులు కొంతమంది ఇన్‌ఫార్మర్లను నియమించుకుని గంజారుు పండించే ప్రాంతాలను వారి ద్వారా తెలుసుకుని ఆ ప్రాంతాలపై దాడులు చేసేవారు. ఇలా దాడులు ఎక్కువ చేయటంతో గంజారుు పంటను పండించే వారు తగ్గిపోయారు. ఆరు నెలల క్రితం బైరాపూర్ తండాలో కొంతమంది తమ ఇళ్ల ముందే గంజారుు మొక్కలను నాటారు. ఎకై ్సజ్‌శాఖ అధికారులు అక్కడకు వెళ్లి 102 గంజారుు మొక్కలను ధ్వంసం చేసి తొలగించారు. మొక్కలను నాటిన వారిపై కేసులు నమోదు చేశారు. అనంతరం గంజారుు పంటను పండించే వారిని బైండోవర్లు చేయటం మొదలుపెట్టడంతో పూర్తిగా తగ్గింది. కానీ.. ప్రస్తుతం జిల్లాలో గంజా రుు పండించే పంటలు పూర్తిగా నిర్మూలన అరుునప్పుటికి ఒరిస్సా నుంచి నిజామాబాద్ అడ్డాగా మహారాష్ట్రకు స్మగ్లర్లు గంజారుు రవాణా చేస్తునే ఉన్నారు.

పెద్ద ఘటనలు..
గత జూలై 1న ఢిల్లీ పాలెం ఎరుుర్‌పోర్టు రాజ్‌నగర్‌కు చెందిన రాజ్‌కుమార్, జై చాపల్ ఆర్‌కే పురం సబ్జి మార్కెట్‌కు చెందిన ఎస్ విజయ్‌పాల్ స్మగ్లర్లు ఒరిస్సా నుంచి వయా నిజామాబాద్ మీదుగా ఢిల్లీకి గంజారుు రవాణా చేస్తూ నిజామాబాద్ రూరల్ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని నుంచి పోలీసులు రెండు క్వింటాళ్ల గంజారుు స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజారుు కొనుగోలు చేసిన వర్ని మండలం శ్రీనగర్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. స్మగ్లర్ల నుంచి రూ.7.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

ఈ యేడాది ఏప్రిల్ 27న గాంధారి మండలంలో ఎకై ్సజ్‌శాఖ అధికారులు  100 కిలోల ఎండు గంజారుుని పట్టుకున్నారు. దీనిని భిచ్కుంద మండలం పెద్దకొడపల్‌గల్ గ్రామానికి చెందిన భగీరథ అనే వ్యక్తి గంజారుుని తీసుకెళ్తున్నట్లు అధికారులకు పట్టుబడిన వ్యక్తులు తెలుపటంతో అప్రమత్తమైన అధికారులు భగీరథ ఇంట్లో సోదాలు చేపట్టారు. కానీ.. భగీరథ అంతకుముందే తప్పించుకుని పోయాడు. ఇప్పటి వరకు భగీరథ పోలీసులకు చిక్కక పోవటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement