కడప : ఎర్ర చందనం స్మగ్లర్లు మరోసారి బరితెగించారు. రైల్వేకోడూరు మండలం వాగేటి కోన వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు రువ్వారు. ఈ సంఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. స్మగ్లర్ల చర్యకు ప్రతిచర్యగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ స్మగ్లర్ మృతి చెందగా, మిగిలిన వారు పరారయ్యారు.
మరోవైపు పొండూరు మండలం బైపాస్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా ఆయిల్ ట్యాంకర్లో అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్ర చందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 50 ఎర్ర చందనం దుంగలను సీజ్ చేసి డ్రైవర్ను అరెస్ట్ చేశారు.
మరోసారి బరితెగించిన ఎర్ర చందనం స్మగ్లర్లు
Published Sat, Jun 21 2014 11:19 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement