వైఎస్ఆర్ కడప జిల్లా : రైల్వే కోడూరు మండలం బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద సీఐ రసూల్‌సాహెబ్ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది శనివారం కూంబింగ్ నిర్వహించారు. రైల్వే ట్రాక్ వద్ద రవాణా చేసేందుకు ఉంచిన 100 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న విషయాన్ని పసిగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు అక్కడి నుంచి పరారైయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.