Rs. 2 crore
-
రూ. 2 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా రాయచోటి రూరల్, రైల్వేకోడూరు సర్కిళ్ల పరిధిలో 2.5 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నవీన్ గులాటి వివరాలు వెల్లడించారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 2.5 కోట్లు విలువ చేస్తుందని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాలో నలుగురు అటవీ శాఖ సిబ్బంది కూడా పట్టుబడ్డారని తెలిపారు. వారి నుంచి ఓ ట్రక్కు, నాలుగు కార్లు, 4 ద్విచక్రవాహనాలు, 4 సెల్ఫోన్లతో పాటు 15 మందిని అరెస్ట్ చేసినట్లు వివరాలు తెలిపారు. -
ఎర్రచందనం స్వాధీనం: పరారైన స్మగ్లర్లు
వైఎస్ఆర్ కడప జిల్లా : రైల్వే కోడూరు మండలం బాలుపల్లి చెక్ పోస్ట్ వద్ద సీఐ రసూల్సాహెబ్ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీశాఖ సిబ్బంది శనివారం కూంబింగ్ నిర్వహించారు. రైల్వే ట్రాక్ వద్ద రవాణా చేసేందుకు ఉంచిన 100 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే కూంబింగ్ నిర్వహిస్తున్న విషయాన్ని పసిగట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు అక్కడి నుంచి పరారైయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. -
బస్సు చార్జీల పెంపు పై దృష్టి