![Police arrested The Gold Smugglers In Chittoor - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/27/gold.jpg.webp?itok=snzn8BsY)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, చిత్తూరు : రేణిగుంట అటవీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మీదుగా రాజంపేటకు బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయపురం చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. అటుగా వస్తున్న టాటా సుమోను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారు బిస్కెట్లను గుర్తించారు.
దీంతో వాహనంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా కడప వాసులుగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కువైట్‌లో పనిచేస్తూ సొంత ఊరికి వెళ్తామని చెప్పి సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి ఎక్కడా అనుమానం రాకుండా పక్కా పథకం ప్రకారం స్మగ్లింగ్ చేశారన్నారు. వాహనంతో పాటు ఆరుగురిని రేణికుంట అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment