బాషా చిత్రం తమిళ సినిమాలో ఒక చరిత్ర. గ్యాంగ్‌స్టర్‌గా సూపర్‌స్టార్ నటనకు పరాకాష్టగా పేర్కొనవచ్చు. అప్పట్లో రికార్డులు తిరగరాసిన బాషా చిత్రాన్ని రీమేక్ చేయాలని ఆ చిత్ర దర్శకుడు సురేశ్‌కృష్ణ ప్రయత్నించినా రజనీకాంత్ నిరాకరించారు. అంతే కాదు బాషా ఒక్కడే అని ఆయన ఏకవాక్యం చేశారు కూడా. మరి బాషాకు దీటుగా మరో చిత్రం వచ్చేనా. వస్తుందంటున్నారు యువ దర్శకుడు పా.రంజిత్. ఈయన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల సూపర్‌స్టార్‌తో ఆయన తెరకెక్కించిన కబాలి చిత్రమే చాలా చెప్పేసింది. కాగా కబాలి చిత్ర టేకింగ్‌కు ముగ్ధుడైన సూపర్‌స్టార్ రంజిత్‌తో వెంటనే మరో చిత్రం చేయడానికి రెడీ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని ఆయన అట్లుడు, నటుడు ధనుష్ తన సొంత సంస్థ వండర్‌బార్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.