కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని గొంతు కోసి హతమార్చారు.
కర్నూలు జిల్లా కోవెలకుంట్ల ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక యువకుని గొంతు కోసి హతమార్చారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడు సాదరదిన్నె గ్రామానికి చెందిన బాషా(38)గా గుర్తించారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదైహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.