రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి | man crushed between rail wagans | Sakshi
Sakshi News home page

రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కుని వ్యక్తి మృతి

Published Wed, Feb 15 2017 12:50 AM | Last Updated on Tue, Oct 9 2018 5:39 PM

man crushed between rail wagans

నల్లింగాయపల్లె (కమలాపురం) : కమలాపురం మండల పరిధిలోని నల్లింగాయపల్లె సమీపంలోని భారతి సిమెంట్‌ ఫ్యాక్టరీ రైల్వే లైను వద్ద ప్రమాదవశాత్తూ రైలు వ్యాగన్ల మధ్య ఇరుక్కొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ మహ్మద్‌ రఫీ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. తలుపుల మండలం పెద్దన్నగారిపల్లెకు చెందిన మహబూబ్‌ బాషా(35) మూడేళ్లుగా భారతి పరిశ్రమకు బయటి నుంచి బొగ్గు వచ్చే రైల్వే విభాగంలో పాయింట్‌ మె¯ŒSగా పని చేస్తున్నాడు.

బొగ్గు అ¯ŒSలోడింగ్‌ అయ్యాక వ్యాగన్లకు మధ్య కప్లింగ్‌ వేసి జాయింట్‌ చేసే పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో మంగâýæవారం తెల్లవారు జామున బొగ్గు అ¯ŒSలోడ్‌ అయ్యాక రెండు వ్యాగన్లకు మధ్య కప్లింగ్‌ వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ వ్యాగన్లకు ఉన్న రాడ్లు మృతుని కుడి చేతి వైపు బలంగా గుద్దు కోవడంతో వ్యాగన్ల మధ్య ఇరుక్కుని మృతి చెందాడు. మృతుడికి భార్య తాహరాబీ,  ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాహరాబీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement