ప్రేమించినోడికి బైబై చెప్పింది | she is break up with lover basha | Sakshi

ప్రేమించినోడికి బైబై చెప్పింది

Published Mon, Jan 5 2015 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 7:13 PM

ప్రేమించినోడికి బైబై చెప్పింది

ప్రేమించినోడికి బైబై చెప్పింది

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటవుదామని పోలీసులను ఆశ్రయించారు. యువతి తల్లిదండ్రులు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు.

వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒక్కటవుదామని పోలీసులను ఆశ్రయించారు.  యువతి తల్లిదండ్రులు వచ్చి కన్నీటిపర్యంతమయ్యారు. తమ పేగు బంధాన్ని కుమార్తెకు గుర్తు చేశారు. కరిగిన యువతి తల్లిదండ్రుల వెంట నడిచింది. ప్రేమించినోడికి బైబై చెప్పింది. సదరు యువకుడు వాహనం వెంట పడినా ఆమె ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ సంఘటనకు ఆదివారం గిద్దలూరు పోలీసుస్టేషన్ వేదికగా నిలిచింది.
 
 గిద్దలూరు రూరల్ : మండలంలోని సూరేపల్లె గ్రామానికి చెందిన బాషా విశాఖపట్నంలో బీటెక్ చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎంటెక్ చదువుతున్న  యువతితో ప్రేమ వ్యవహారం నడిపాడు. ఇంతలో ఆ యువతికి వేరే వ్యక్తితో పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేక ఆమె బాషాతో కలిసి గిద్దలూరు వచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఇంతలో యువతి తల్లిదండ్రులు గిద్దలూరు వచ్చారు. తమ కుమార్తెకు నచ్చజెప్పారు. మధ్యలో చదువు ఆగిపోతుందన్నారు.
 
  పేగు బంధాన్నీ సదరు గుర్తు చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తల్లిదండ్రుల వెంట నడి చేందుకు సిద్ధమైంది. స్నేహితుడు బాషా ఎంత బతిమాలినా ఆమె పట్టించుకోలేదు. యువతి వెళ్తున్న వాహనం వెంట బాషా పరుగులు తీశాడు. ఒకసారి ఆలోచించాలని వేడుకున్నాడు. ఇద్దరి మధ్య ప్రేమనూ గుర్తు చేశాడు. చివరకు పేగు బంధం ముందు ప్రేమ ఓడిపోయింది. ఇందులో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేదాని కన్నా ఆ సన్నివేశం పలువురిని ఆలోచింపజేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement