ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల మండలం పులిచర్ల గ్రామ శివారులో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.
జేబీ చెరువు గ్రామానికి చెందిన బాష(25), చెంచయ్య(60) బైక్‌పై రాచర్లకు వచ్చి వెళ్తుండగా.. ఎదురుగా బైక్ పై వస్తున్న రంగస్వామి(40), భాగ్యలక్ష్మి(35)లను ఢీకొట్టారు. ఈ ప్రమాదం నుంచి భాగ్యలక్ష్మి సురక్షితంగా బయటపడగా.. మిగితా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు 108 సాయంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.