
క్లాప్ అండ్ కట్... ప్రియమణి లైఫ్‌లో ప్రతి రోజూ వినిపించే కామన్ వర్డ్స్! పెళ్లికి ముందూ, పెళ్లి తర్వాత కూడా! అయితే పెళ్లితో ప్రియమణి కెరీర్‌కి ‘కట్’ పడుతుందేమోనని కొందరు అనుకున్నారు. కానీ, అటువంటిదేం లేదు. అప్పుడూ (పెళ్లికి ముందూ)... ఇప్పుడూ (పెళ్లి తర్వాత)... ప్రియమణి కెరీర్‌లో ‘కట్’ అనే మాట వినబడుతోంది. అయితే... కొందరు అనుకున్న ‘కట్’ కాదది, షూటింగులో దర్శకుడు చెప్పేది! పెళ్లికి ముందులానే ప్రియమణి కొత్త సినిమాలకు హ్యాపీగా క్లాప్ కొడుతూనే ఉన్నారు.
లేటెస్ట్‌గా కన్నడలో కొత్త దర్శకుడు వినయ్ బాలాజీ తీయబోయే క్రైమ్ థ్రిల్లర్ ‘నన్న ప్రకార’కి క్లాప్ కొట్టారు. ఇందులో కిశోర్ లీడ్ యాక్టర్. రజనీకాంత్ ‘కబాలి’లో గ్యాంగ్‌స్టర్‌గా, కమల్‌హాసన్ ‘చీకటి రాజ్యం’లో పోలీస్‌గా నటించారీయన. తెలుగులో కిశోర్ విలన్‌గా నటించిన రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ నవంబర్ 3న విడుదల కానుంది. ప్రియమణి, కిశోర్ నటించనున్న క్రైమ్ థ్రిల్లర్ ‘నన్న ప్రకార’ చిత్రీకరణ నవంబర్ 6న ప్రారంభం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment