ఎయిమ్స్ ప్రతిపాదనపై టీ.ఎంపీలతో ఆరోగ్యమంత్రి
న్యూఢిల్లీ : తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు విరివిగా ఉన్నాయన్న సమాచారంతోనే ఎయిమ్స్ తరహా ఆస్పత్రి కోసం రాష్ట్రాన్ని ప్రతిపాదన అడగలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ అన్నట్లు టీ.ఎంపీలు తెలిపారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేకప్రతినిధి రామచంద్రుడు, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కె.కవిత ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యమంత్రిని కలిసి, తెలంగాణకు ఎయిమ్స్ తరహా ఆస్పత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు అందుబాటులో లేవని చెప్పారు.
ఎయిమ్స్ తరహా ఆస్పత్రుల కోసం ఇటీవల 13 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి లేఖవచ్చిందని, తెలంగాణను ఎందుకు పట్టించుకోలేదని ఎంపీలు ప్రశ్నించారు. సరైన సమాచారం తెప్పించుకుని తెలంగాణకు న్యాయం చేస్తానన్నారని టీ.ఎంపీలు తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి రూ.వంద కోట్లు, ఇతర వర్సిటీలకు రూ.ఏభై కోట్లు మంజూరు చేయాలని కేంద్రమానవ వనరుల శాఖ స్మృతి ఇరానిని కోరారు.
ఆస్పత్రులున్నాయనే.. అడగలే దు!
Published Wed, Jul 2 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM
Advertisement
Advertisement