సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్‌ఎస్ పాలనలో పార్టీ కోసం పనిచేసిన వారికే బదిలీలు చేసేవారని అన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీచర్లకు హామీ ఇచ్చి వారిని మోసం చేసిన ఘనత కేసీఆర్‌దే అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కాగా, హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ముందు డాక్టర్‌కు చూపించండి. నిన్న టీచర్స్ డేను టీచర్లు పండుగలా చేసుకున్నారు. నిన్న రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో పాల్గొనలేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి 2014 నుంచి 2023 వరకు టీచర్స్ డే వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారా?. నిన్న ఐటీ సదస్సులో సీఎం పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి టీచర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ ఎప్పుడైనా టీచర్స్ సమస్యలపై సమీక్ష చేపట్టారా?. సీఎం రేవంత్ ఇప్పటికే 30 మందికి ప్రమోషన్ ఇచ్చారు. మీ పాలనలో బదిలీలు జరిగితే సస్పెండ్ అయ్యారు. కేసీఆర్ హయాంలో బీఆర్‌ఎస్ కోసం పనిచేసిన వారికే బదిలీలు చేసేవారు. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా బదిలీలు, ప్రమోషన్లు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. జూన్ ఆరో తేదీన ఎన్నికలు అయిపోగానే మరుసటి రోజు సీఎం రేవంత్ బదిలీలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. దరఖాస్తులు పెట్టుకోకున్నా బెస్ట్ టీచర్ అవార్డులు ఇచ్చాం. తెలంగాణ వచ్చిన తర్వాత టీచర్లపై బీఆర్‌ఎస్ వివక్షత చూపింది. కొఠారీ కమిషన్ బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు ఇవ్వాలంటే.. సీఎం రేవంత్ మాత్రం ఏడు శాతం ఇచ్చారు. విద్య పట్ల సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంది’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment