super speciality hospitals
-
వైద్య, ఆరోగ్యానికి ‘సూపర్’ ట్రీట్మెంట్
కంటికి కనిపించని కరోనా వైరస్ 2020లో మిగిల్చిన చేదు అనుభవాలు.. వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ తాలుకు చేదు జ్ఞాపకాలతో రాష్ట్ర ప్రజలు 2021లోకి అడుగుపెట్టారు. కానీ, కోవిడ్ ప్రభావం తగ్గిందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఏప్రిల్, మే నెలల్లో ఊహించని రీతిలో వైరస్ రెండో విడతలో ఒక్కసారిగా విజృంభించింది. దీంతో 2021లో కూడా వైరస్ భయంతోనే బిక్కుబిక్కుమంటు గడిపారు. తాజాగా.. ఒమిక్రాన్ రూపంలో వైరస్ వ్యాప్తి మరోసారి మొదలైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ 11.94 లక్షల మంది వైరస్ బారినడ్డారు. వీరిలో 11.86 లక్షల మంది కోలుకోగా 7,384 మంది మృత్యువాత పడ్డారు. ఊహించని రీతిలో వైరస్ విజృంభించినా సమర్థవంతంగా కట్టడి చర్య చేపట్టి జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రశంసలు పొందింది. – సాక్షి, అమరావతి వేగంగా టీకా పంపిణీ 2021 జనవరి 16న రాష్ట్రవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీకి శ్రీకారం చుట్టారు. విజయవాడ జీజీహెచ్‌లో పారిశుధ్య ఉద్యోగిని పుష్పకుమారి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తొలిడోసు టీకా వేసుకుంది. ఆ రోజు నుంచి దశల వారీగా ఎంపిక చేసిన వర్గాలకు టీకా పంపిణీలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇలా సంవత్సరాంతానికి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారిలో తొలిడోసు టీకాను 100 శాతాన్ని అధిగమించగా.. 74.08 శాతం మందికి రెండు డోసుల టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా కట్టడికి రూ.3,683 కోట్లు ఇక ఈ ఏడాది నవంబర్ 24 నాటికి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.3,683.05 కోట్లు ఖర్చుచేసింది. కరోనా విజృంభణ అధికంగా ఉన్న సమయంలో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. ప్రణాళికాబద్ధంగా ఆక్సిజన్, మందులు సరఫరా చేయడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈ అనుభవాలతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధప్రాతిపదికన 175 ప్రెజర్ స్వింగ్ అబ్జార్షన్ (పీఎస్ఏ) ప్లాంట్లు ఏర్పాటుచేసింది. తద్వారా 24,419 పడకలకు ఆక్సిజన్ సరఫరా సమకూరుతోంది. ఆసుపత్రుల్లో విప్లవాత్మక మార్పులు మరోవైపు.. మొత్తం వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు సీఎం జగన్ ప్రభుత్వం నాడు–నేడు కింద శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కోసం ఆసుపత్రుల్లో వసతుల కల్పన, మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం రూ.16,255 కోట్లు ఖర్చుచేస్తోంది. ఇందులో భాగంగా 2021లో 14 మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఈ ఏడాది మే 31న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిజానికి రూ.7,880 కోట్లతో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటి నిర్మాణం వివిధ దశల్లో ఉంది. అలాగే, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ చరిత్రలో గతంలో ఎన్నడూలేని విధంగా వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా భారీగా నియామకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు, కొత్తగా పోస్టులను సృష్టించి అక్టోబర్, నవంబర్ నెలల్లో 14,818 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీచేసింది. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తి అయ్యాయి. మరికొన్నింటి ప్రక్రియ కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరిలో ఇది మొత్తం పూర్తికానుంది. నీతి ఆయోగ్ ప్రశంసలు దేశంలో మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్న అత్యంత తక్కువ రాష్ట్రాల్లో ఏపీ ఒకటని నీతి ఆయోగ్ ప్రశంసించింది. అంతేకాక.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న మధ్యతరగతి కుటుంబాల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసానిస్తోందని పేర్కొంది. నీతి ఆయోగ్ వెల్లడించిన 2019–20 ఆరోగ్య సూచీల్లో దేశంలో రాష్ట్రానికి నాలుగో ర్యాంకు దక్కింది. మాత, శిశు మరణాల కట్టడిలో ప్రభుత్వం సుస్థిర లక్ష్యాలను సాధించినట్లు ప్రశంసించింది. అలాగే, గతంతో పోలిస్తే రాష్ట్రంలోని ప్రభుత్వ స్పెషలిస్ట్ వైద్యుల కొరత, ఆసుపత్రుల్లో వసతుల కల్పన మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. ఇక రాష్ట్రంలో ప్రజారోగ్యం మెరుగుపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గుడ్ గవర్నెన్స్ 2020–21 నివేదికలో పేర్కొంది. గతంతో పోలిస్తే పీహెచ్‌సీల్లో వైద్యుల అందుబాటు 6 శాతం పెరిగినట్లు తెలిపింది. కోవిడ్ కట్టడికి గ్రామ, వార్డు వలంటీర్లు, ఏఎన్ఎంల ద్వారా ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్ మెచ్చుకుంది. రోగుల హోమ్ ఐసోలేషన్, వారి ఆరోగ్య పరిస్థితి నిత్య పర్యవేక్షణ, ఇతర చర్యలు భేషుగ్గా ఉన్నాయని తన అధ్యయనంలో పేర్కొంది. -
‘సూపర్..’ స్పెషాలిటీ వైద్యం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలలకు అనుబంధంగా బోధనాసుపత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని స్పెషాలిటీల్లో యూనిట్లు పెంచాలని వైద్య విద్యా శాఖ నిర్ణయించింది. యూనిట్ల కొరతతో కొన్ని శస్త్రచికిత్సలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఉంది. యూనిట్లు పెంచితే ఈ సమస్య ఉండదు. ఒక యూనిట్లో 10 పడకలతో పాటు ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వస్తారు. దీంతో ఎమర్జెన్సీ కేసులకు వెంటనే సర్జరీ చేసే అవకాశం ఉంటుంది. ఆరు విభాగాల్లో యూనిట్లు ప్రస్తుతం ఆరు విభాగాల్లో అదనంగా యూనిట్లు పెంచాలని నిర్ణయించారు. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్, అనస్థీషియా, పీడియాట్రిక్స్ విభాగాల్లో యూనిట్లు పెంచాల్సిన అవసరముందని ఇప్పటికే వైద్య విద్యా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆయా బోధనాసుపత్రుల్లో ఇన్ పేషెంట్ల సంఖ్య, పని భారాన్ని బట్టి యూనిట్లను నిర్ణయిస్తారు. ప్రధానంగా కింగ్‌జార్జి, గుంటూరు, తిరుపతి రుయా, కర్నూలు, నెల్లూరు, కాకినాడల్లో యూనిట్లు పెంచేందుకు అవకాశం ఉంది. కొత్త స్పెషాలిటీలూ అవసరమే ప్రస్తుతం మెజారిటీ ఆస్పత్రుల్లో పలు స్పెషాలిటీల్లో వైద్యులు లేరు. సూపర్ స్పెషాలిటీలో అయితే పోస్టులు కూడా మంజూరు కాలేదు. ఈ నేపథ్యంలో ఏడు విభాగాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించాలని ప్రతిపాదించారు. ఇందులో పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాలున్నాయి. ఐదు చోట్ల క్యాన్సర్ చికిత్సలు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా రోజురోజుకూ క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఐదు చోట్ల క్యాన్సర్ చికిత్సకు ప్రాధాన్యమిచ్చారు. విశాఖపట్నం, కడప, తిరుపతి, కర్నూలు, గుంటూరుల్లో ఈ చికిత్స చేస్తారు. గుంటూరులో ఇప్పటికే నాట్కో సహకారంతో ఏర్పాటు చేసిన ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కర్నూలులో రూ.120 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 200 పడకలు ఉంటాయి. విశాఖపట్నంలో రూ.60 కోట్లతో క్యాన్సర్ బ్లాక్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిధులు సమకూరుస్తున్నారు. కడపలోనూ క్యాన్సర్ చికిత్సకు ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నారు. ఇన్నాళ్లూ క్యాన్సర్ చికిత్స ప్రభుత్వ పరిధిలో లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళుతున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ సొమ్ములో ఎక్కువ భాగం ప్రైవేట్‌కే వెళుతోంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్స జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. -
ఎస్సీ,ఎస్టీలకు అండ
-
ఏడు గిరిజన ప్రాంతాల్లో 7 ‘సూపర్’ ఆసుపత్రులు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని ఏడు ఐటీడీఏల్లో (గిరిజన ప్రాంతాలు) సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అరకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, దోర్నాలలో సూపర్ స్పెషాల్టీ ఆసుపత్రుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ, పాడేరులో ట్రైబల్ మెడికల్ కాలేజీ, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. డిమాండ్ ఉన్నచోట కొత్త హాస్టళ్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. 309 హాస్టళ్లలో కుక్స్, వాచ్మెన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మూడు దశల్లో హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు ప్రతి హాస్టల్లో వెంటనే టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, ప్రాధాన్యం ప్రకారం అందుబాటులోకి తేవాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లలో నాణ్యతపై అధికారులు దృష్టి సారించి క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని సూచించారు. పాఠశాలల్లో మూడు దశల్లో 9 రకాల సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టల్స్‌లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హాస్టళ్లలో మంచాలు, దుప్పట్లు సహా అన్ని సౌకర్యాలు కల్పించాలని, మూడు దశల్లో ఈ పనులు పూర్తి చేయాలన్నారు. మన పిల్లలను స్కూలుకు పంపిస్తే ఎలా ఆలోచిస్తామో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లలో చదివే విద్యార్థుల గురించి కూడా అలాగే ఆలోచించాలన్నారు. హాస్టళ్లలో వసతుల కల్పన కోసం నిధుల లభ్యత గురించి సీఎం ఆరా తీశారు. వచ్చే ఏడాది నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ స్కూలు తెరిచే సమయానికి యూనిఫారాలు, పుస్తకాలు అందించి తీరాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలని సూచించారు. వైఎస్సార్ చేయూత సాయం వచ్చే ఏడాది నుంచి నామినేటెడ్ పోస్టులు, నామినేషన్ పనుల్లో కచ్చితంగా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైఎస్సార్ చేయూత కింద లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించాలని, వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. సంతృప్తికర స్థాయిలో పార్టీలు, వర్గాలకు అతీతంగా అర్హులందరికీ ఇది అందాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని సూచించారు. గిరిజనులకు అటవీ భూములపై పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని, ఈమేరకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు బిల్లు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. -
ఈ ఏడాదే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాదే ఐదు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను, వరంగల్‌లో ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారు లను ఆదేశించారు. సూపర్ స్పెషాలి టీ ఆస్పత్రుల్లో నాలుగింటిని హైదరాబాద్‌లో, ఒకదానిని వరంగల్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటికి వచ్చే బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించాలన్నారు. ఇక వరంగల్ సెంట్రల్ జైలు, హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలు, రేస్ కోర్సులను వేరే ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రుల నిర్మాణం, జైళ్ల తరలింపు అంశాలపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్షించారు. వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ), దానిని ఆనుకుని ఉన్న సెంట్రల్ జైలు ప్రాంతాన్ని కలిపి.. ఆరోగ్య యూనివర్సిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ప్రసూతి బ్లాకులను నిర్మించాలని సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. సెంట్రల్ జైలును నగర శివార్లలోని మరో చోట పూర్తి స్థాయి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి తరలించాలన్నారు. వరంగల్ ఎంజీఎంను కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఇక హైదరాబాద్‌లో కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని, వాటికి వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని ఆదేశించారు. చంచల్‌గూడ జైలు, రేస్ కోర్సులను తరలించి.. వాటి స్థానంలో రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు ఇతర ప్రజోపయోగ నిర్మాణాలు చేపట్టాలన్నారు. వీటికి సంబంధించిన ప్రతిపా దనలు తయారు చేయాలని ఆదేశించారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, సీనియర్ అధికారులు రాజీవ్ త్రివేదీ, తివారీ, రామకృష్ణారావు, నర్సింగ్‌రావు, కాళోజీ ఆరోగ్య వర్సిటీ వీసీ కరుణాకర్, డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. 1,907 పోస్టులు మంజూరు రాష్ట్రంలోని మైనారిటీ, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లకు 1,907 పోస్టులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన ఫైలుపై బుధవారం సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఇందులో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 1,640 పోస్టులు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 267 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. -
ఆస్పత్రులున్నాయనే.. అడగలే దు!
ఎయిమ్స్ ప్రతిపాదనపై టీ.ఎంపీలతో ఆరోగ్యమంత్రి న్యూఢిల్లీ : తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు విరివిగా ఉన్నాయన్న సమాచారంతోనే ఎయిమ్స్ తరహా ఆస్పత్రి కోసం రాష్ట్రాన్ని ప్రతిపాదన అడగలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ అన్నట్లు టీ.ఎంపీలు తెలిపారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేకప్రతినిధి రామచంద్రుడు, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కె.కవిత ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యమంత్రిని కలిసి, తెలంగాణకు ఎయిమ్స్ తరహా ఆస్పత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు అందుబాటులో లేవని చెప్పారు. ఎయిమ్స్ తరహా ఆస్పత్రుల కోసం ఇటీవల 13 రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ నుంచి లేఖవచ్చిందని, తెలంగాణను ఎందుకు పట్టించుకోలేదని ఎంపీలు ప్రశ్నించారు. సరైన సమాచారం తెప్పించుకుని తెలంగాణకు న్యాయం చేస్తానన్నారని టీ.ఎంపీలు తెలిపారు. అలాగే నిజామాబాద్ జిల్లాలో ఐఐఎం ఏర్పాటు చేయాలని, ఉస్మానియా వర్సిటీ అభివృద్ధికి రూ.వంద కోట్లు, ఇతర వర్సిటీలకు రూ.ఏభై కోట్లు మంజూరు చేయాలని కేంద్రమానవ వనరుల శాఖ స్మృతి ఇరానిని కోరారు. -
'ప్రతీ జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం'