Sudheer Babu Next movie shooting started - Sakshi
Sakshi News home page

Sudheer Babu: కొత్త సినిమాను పట్టాలెక్కించిన సుధీర్‌ బాబు

Published Tue, Dec 28 2021 8:33 AM | Last Updated on Tue, Dec 28 2021 9:13 AM

Sudheer Babu Next Film Directed By Harsha Vardhan Goes On Floors - Sakshi

Sudheer Babu Next Film Directed By Harsha Vardhan Goes On Floors: సుధీర్‌బాబు కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతున్న చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ షురూ అయ్యింది. నటుడు–దర్శకుడు హర్షవర్ధన్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ పతాకంపై నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. షూటింగ్‌ ప్రారంభం అంటూ చిత్రయూనిట్‌ ఓ వర్కింగ్‌ స్టిల్‌ను విడుదల చేసింది.


నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సుధీర్‌బాబు కోసం భిన్నమైన కథను రెడీ చేశారు హర్షవర్ధన్‌. ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తారు సుధీర్‌ బాబు. ఈ చిత్రంలో ఛాలెంజింగ్‌ పాత్రను పోషిస్తున్నారాయన. ఈ తొలి షెడ్యూల్‌లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: చేతన్‌ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement