ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ క్లిష్టమైన సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సులభంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం ‘ఈ బ్లడ్ సర్వీసెస్’ అనే యాప్‌ను ప్రారంభించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్‌సీఎస్) భాగస్వామ్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మంతత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే కొద్ది నిమిషాల్లోనే రక్తం అందిస్తారని, సింగిల్ విండో యాక్సెస్ ద్వారా ఈ సేవలు పొందడం చాలా సులభమని హర్షవర్దన్ పేర్కొన్నారు. (కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ )
The App will act as a boon for the needy. @IndianRedCross has always assisted the Government in various health programs. I commend this effort that they have made during difficult #COVID19. The needy will now have easy access to blood now@cdacindia @MoHFW_INDIA @WHO @pagthals pic.twitter.com/ZblUXas0NO
— Dr Harsh Vardhan (@drharshvardhan) June 25, 2020
ఎంతో పారదర్శకంగా పనిచేయడంతో పాటు రక్తం అత్యవసరమైన వారికి తొందరగా చేరుస్తారని అన్నారు. రక్తం కావాలనుకునే వారు యాప్‌లో రిజిస్టార్ చేసుకోవాలని, దీని ద్వారా ఏఏ ప్రాంతాల్లో రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం తెలుస్తుందని చెప్పారు. రక్తం అవసరమైన వారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్లు అందుతుందని చెప్పారు. రెడ్‌క్రాస్ సంస్థ వివిధ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహాయం అందిస్తోందని మంత్రి కొనియాడారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలబడిందని హర్షవర్దన్ ప్రశంసించారు. (నా కూతురు కెప్టెన్ అని నాన్న అంటుంటే.. )
Comments
Please login to add a commentAdd a comment