redcross
-
రెడ్‌క్రాస్ బృందానికి కలెక్టర్ అభినందనలు
సుభాష్‌నగర్ : ఐఎస్ఓ సర్టిఫికెట్ పొందినందుకుగాను జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు గురువారం సాయంత్రం నిజామాబాద్ రెడ్‌క్రాస్ సొసైటీ బృందాన్ని అభినందించారు. భవిష్యత్‌లో ఇలాగే నిజామాబాద్ రెడ్‌క్రాస్ సేవలు విస్తరించాలని, రాష్ట్రంలో జిల్లా కీర్తిని మరింత ప్రతిబింబింపజేయా లని కలెక్టర్ సూచించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రాను రెడ్‌క్రాస్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్‌ను రెస్‌క్రాస్ బృందం సన్మానించింది. కార్యక్రమంలో నిజామాబాద్ రెడ్‌క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపె రవీందర్, కార్యదర్శి అరుణ్ బాబు, నిజామాబాద్ డివిజన్ చైర్మన్ డాక్టర్ శ్రీశైలం, పీఆర్వో బొద్దుల రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు -
రెడ్‌క్రాస్ సేవలు అమూల్యం.. కోవిడ్ సమయంలో అద్భుత సేవలు
సాక్షి, అమరావతి/పటమట(విజయవాడ తూర్పు): సమాజ శ్రేయస్సు కోసం రెడ్‌క్రాస్ సభ్యులు అమూల్యమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రక్తం అందక ఒక్కరు కూడా ప్రాణం కోల్పోకూడదని, ఇందుకోసం మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులకు ఆయన సూచించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ శాఖ వార్షిక అవార్డుల (2019–20, 2021–22 సంవత్సరాలకు) ప్రదానోత్సవం విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ సమాజంలోని పేద, బడుగు, బలహీన వర్గాలకు మానవతా దృక్పథంతో సేవలు అందించడంలో రెడ్‌క్రాస్ ముందంజలో ఉందన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రెడ్‌క్రాస్ తన పాత్రను అద్భుతంగా పోషించిందని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రక్తం, ఆక్సిజన్, మాస్కులు, మందులు వంటివి అందించడం ద్వారా వేల మంది రోగుల ప్రాణాలు కాపాడిందని కొనియాడారు. రోగులకు, తలసేమియా బాధిత పిల్లలకు సురక్షితమైన రక్తాన్ని అందించాలనే లక్ష్యంగా రెడ్‌క్రాస్ పని చేయడం ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటుతో 26 జిల్లాల కలెక్టర్లు, మేనేజింగ్ కమిటీలు సేవలు అందించడం ద్వారా రెడ్‌క్రాస్ మరింత బలోపేతమైందని తెలిపారు. జిల్లా శాఖలు మారుమూల గ్రామీణ, గిరిజన ప్రజలకు చేరువకావడంపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. యువత, విద్యార్థులను చైతన్యవంతం చేయడం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలన్నారు. నిరుపేదలకు సేవలు అందించడానికి అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన రెడ్‌క్రాస్ ఏపీ శాఖ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్పీ సిసోడియా, ప్రధాన కార్యదర్శి ఏకే పరిడాను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరంఎన్టీఆర్, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు ఎస్.ఢిల్లీరావు, పి.రంజిత్‌బాషా, శ్రీకేష్.బి.లతకర్, ఎ.సూర్యకుమారి, గుంటూరు జేసీ ఎ.దినేష్‌కుమార్, రాజమండ్రి సబ్ కలెక్టర్ డాక్టర్ పి.మహేష్‌కుమార్‌తోపాటు తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా, సింగపూర్ రెడ్‌క్రాస్ సొసైటీ, జిల్లాస్థాయిలో విస్తృతంగా సేవలు అందించిన 94 మంది నిస్వార్థ సేవకులకు అవార్డులను, ట్రోఫీలను గవర్నర్ ప్రదానం చేశారు. ‘నాటా’కు ప్రశంశలు కోవిడ్–19 సమయంలో నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 150 ఆక్సిజన్ సిలిండర్లను రెడ్‌క్రాస్ ద్వారా సహాయం చేసినందుకు అప్పటి నాటా అధ్యక్షుడు గోసాల రాఘవరెడ్డి, కార్యదర్శి ఆళ్ల రామిరెడ్డి, కోశాధికారి గండ్ర నారాయణరెడ్డిని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. ఆ సంస్థ సేవలకు గుర్తింపుగా నాటా పీఆర్ అండ్ మీడియా కో–ఆర్డినేటర్ డీవీ కోటిరెడ్డి, ఎం.పార్థసారథిరెడ్డి, కె.సాంబశివారెడ్డికి గవర్నర్ మెడల్, అవార్డులను ప్రదానం చేశారు. పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌కు రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ సాక్షి, హైదరాబాద్: పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌ను రెడ్‌క్రాస్ గోల్డ్‌మెడల్ వరించింది. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) అధ్యక్షుడు విశ్వభూషణ్ హరిచందన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఏపీలోని విజయనగరం జిల్లా కురుపం గ్రామంలో మెడికల్ క్యాంపులో కావాల్సిన వనరులను సమకూర్చినందుకు, అలాగే చిత్తూరులో బ్లడ్ బ్యాంకు నిర్మాణం చేపట్టినందుకు గాను పవర్‌గ్రిడ్‌కు ఈ అవార్డు లభించింది. కాగా, పవర్‌గ్రిడ్ ఈ రెడ్‌క్రాస్ గోల్డ్ మెడల్‌ను అందుకోవడం ఇది మూడోసారి. పవర్‌గ్రిడ్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అవార్డును అందుకున్నారు. (క్లిక్ చేయండి: ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు) -
రెడ్‌క్రాస్ సేవలు శ్లాఘనీయం
సాక్షి, అమరావతి/పాడేరు రూరల్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): రెడ్‌క్రాస్ సొసైటీ అనుసరిస్తున్న మానవతా స్ఫూర్తిని మరింతగా వ్యాప్తిలోకి తీసుకురావాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని, పాడేరు జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన థలసేమియా, సికిల్‌సెల్ ఎనీమియా చికిత్సా కేంద్రాన్ని రాజ్‌భవన్ నుంచి వర్చువల్ విధానంలో గవర్నర్ ప్రారంభించారు. అడ్వాన్స్డ్ లైఫ్‌సపోర్ట్ సిస్టం అంబులెన్స్‌ను ప్రారంభించారు. రెడ్‌క్రాస్ ఏపీ చైర్మన్ శ్రీధర్, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొన్నారు. -
రక్తం అవసరం ఉన్నవారికి ఇకపై సులభంగా
ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. ఈ క్లిష్టమైన సమయంలో రక్తం అవసరం ఉన్నవారికి సులభంగా అందించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ గురువారం ‘ఈ బ్లడ్ సర్వీసెస్’ అనే యాప్‌ను ప్రారంభించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) భాగస్వామ్యంతో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని మంతత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుంటే కొద్ది నిమిషాల్లోనే రక్తం అందిస్తారని, సింగిల్ విండో యాక్సెస్ ద్వారా ఈ సేవలు పొందడం చాలా సులభమని హర్షవర్దన్ పేర్కొన్నారు. (కరోనా కొత్త హాట్ స్పాట్ ఢిల్లీ ) The App will act as a boon for the needy. @IndianRedCross has always assisted the Government in various health programs. I commend this effort that they have made during difficult #COVID19. The needy will now have easy access to blood now@cdacindia @MoHFW_INDIA @WHO @pagthals pic.twitter.com/ZblUXas0NO — Dr Harsh Vardhan (@drharshvardhan) June 25, 2020 ఎంతో పారదర్శకంగా పనిచేయడంతో పాటు రక్తం అత్యవసరమైన వారికి తొందరగా చేరుస్తారని అన్నారు. రక్తం కావాలనుకునే వారు యాప్‌లో రిజిస్టార్ చేసుకోవాలని, దీని ద్వారా ఏఏ ప్రాంతాల్లో రక్తం నిల్వలు అందుబాటులో ఉన్నాయన్న సమాచారం తెలుస్తుందని చెప్పారు. రక్తం అవసరమైన వారికి బ్లడ్ బ్యాంకుల ద్వారా కనీసం నాలుగు యూనిట్లు అందుతుందని చెప్పారు. రెడ్‌క్రాస్ సంస్థ వివిధ ఆరోగ్య కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ సహాయం అందిస్తోందని మంత్రి కొనియాడారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ ప్రజలకు అండగా నిలబడిందని హర్షవర్దన్ ప్రశంసించారు. (నా కూతురు కెప్టెన్ అని నాన్న అంటుంటే.. ) -
రెడ్‌క్రాస్ భోజన పంపిణి కార్యక్రమం
సాక్షి, పశ్చిమ గోదావరి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ శ్రీ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం భోజన పంపిణి కార్యక్రమం నిర్వహించారు. జనతా కర్ఫ్యూ లోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, కలెక్టరేట్ సిబ్బందికి, ఆశ వర్కర్స్‌కి సిబ్బందికి అలాగే రోడ్డు ప్రక్కల నిరాశ్రయులకు, బిక్షాటన చేసుకునేవారికి భోజనాన్ని అందించారు. దాదాపు 1000 మందికి ఈ కార్యక్రమం ద్వారా ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ జయప్రకాష్ మాట్లాడుతూ దాతలు శ్రీనివాస్ 600 మందికి, కన్యకా పరమేశ్వరి సత్రం వారు 400 మందికి భోజనాన్ని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దిరిశాల వరప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. -
అన్ని మతాలను కలిపేది రక్తదానం
కర్నూలు(హాస్పిటల్): రక్తదానం అన్ని మతాలు, కులాలను కలుపుతుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ చెప్పారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలుమెడికల్ కళాశాల సంయుక్తంగా ఆసుపత్రిలోని సీఎల్జీలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆసుపత్రికి మంజూరైన రక్తసేకరణ, రవాణా వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో అన్ని మతాల వారిని కలిపేది ఒక్క రక్తదానమేనని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ వైద్య కళాశాలలో బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ విభాగం ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ.. రక్తనిధిలో రక్తం కావాలంటే దాతల సహకారం అవసరమన్నారు. పాథాలజి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బాలీశ్వరి , రక్తనిధి వైద్యాధికారులు జి.రేవతి, కె.లక్ష్మి, సునీల్‌కుమార్, పీజీ వైద్య విద్యార్థులు, జిల్లా ఎయిడ్స్‌నివారణ, నియంత్రణ విభాగం డీపీఎం అలీ హైదర్, ప్రసాద్, డివి శంకర్, నజీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలు, రక్తదాతలను ప్రోత్సహించిన సంస్థలను అభినంది, జ్ఞాపికలు అందించారు. రక్తదానానికి ముందుకు రావాలి రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. చే యూత్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ రక్తనిధిలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ రక్తం గ్రూపులు కనుగొన్న శాస్త్రవేత్త కార్ట్ ల్యాండ్ స్టీనర్ పుట్టిన రోజు సందర్భంగా 2000 సంవత్సరం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవంత్సరం జూన్ 14వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
రెడ్‌క్రాస్ సేవలు ప్రశంసనీయం
–జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ కర్నూలు(హాస్పిటల్): ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఎస్. సత్యనారాయణ అన్నారు. వరల్డ్ రెడ్‌క్రాస్ డే సందర్భంగా సోమవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కర్నూలు బ్రాంచ్‌లో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్నీ డొనాల్ట్ జన్మదినాన్ని పురస్కరించుకుని రెడ్‌క్రాస్ డే నిర్వహిస్తారన్నారు. ఆయన సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో రక్తదాతల సంఖ్య మరింత పెరగాలని, ఈ దిశగా రెడ్‌క్రాస్ చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ గౌరవాధ్యక్షులు డాక్టర్ కేజీ గోవిందరెడ్డి, జిల్లా చైర్మన్ జి. శ్రీనివాసులు మాట్లాడుతూ భవిష్యత్‌లో సేవలు మరింత విస్తృతపరుస్తామన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో రెడ్‌క్రాస్ ద్వారా నీరు–చెట్టు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఐదుగురు మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ జి. శ్రీనివాసులుకు బంగారు పతకం, కోశాధికారి జె. రఘునాథ్‌రెడ్డి, ఈసీ మెంబర్ డి. దస్తగిరి, టి. రాధాకృష్ణ, బి. ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్ ఎం. వెంకటయ్య, ఎం. పద్మావతి, ఎం. నాగరాజు, గోరంట్ల ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, రాయలసీమ గ్రామీణ బ్యాంకు, ఉస్మానియా డిగ్రీ కళాశాల, కేవీ సుబ్బారెడ్డిలకు వెండి పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన 43 మందికి మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో సెట్కూరు సీఈవో మస్తాన్‌వలీ, కర్నూలు ఆర్డీవో హుసేన్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. -
సుందర సత్సంగం సభ్యుల రక్తదానం
శ్రీకాకుళం కల్చరల్: నగరంలో కొన్నేళ్లుగా వేద విద్య, పూజాదికాలు నేర్పుతున్న గురువుకు నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా గురుదక్షిణగా పురుపౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక వైశ్యాబ్యాంకు కాలనీలోని సుందర సత్సంగం ఆధ్వర్యంలో 170 మంది శిషు్యలు రక్తదానం చేశారు. ఇందులో మహిళలే అధికంగా ఉన్నారు. మొదటిగా గురువైన శ్రీపెరుంబుదూరు సూరిబాబు రక్తదానం చేశారు. ఎనిమిదేళ్లుగా శిషు్యలు గురుదక్షిణగా రక్తదానం చేస్తున్నారు. శిబిరాన్ని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనసింహం సందర్శించి మంచి కార్యక్రమం చేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భ ంగా సూరిబాబు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవగా తమ శిషు్యలు చేపట్టిన కార్యక్రమం ఎంతో గొప్పదన్నారు. ఎక్కువగా మహిళలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం ఆనందకరమైన విషయమని చెప్పారు. సామాజిక సేవే పరమావధిగా శిషు్యలు ఎదగాలని కోరారు. అంతకుముందు సూరిబాబుకు శిషు్యలు పాద పూజ చేశారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోçßæనరావు, వైద్యాధికారి సత్యవతి, సుందర సత్సంగం సభ్యులు కేవీ అప్పలనాయుడు, కె.లక్షీ్మనారాయణ, పి.అప్పలరాజు, ప్రసాద్, డాక్టర్ రవికుమార్, విజయలక్ష్మీ, యామిని, పి.చైతన్యకుమార్, డాక్టర్ ఎన్.అప్పన్న, నిక్కు హరిసత్యనారాయణ, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.