
సాక్షి, పశ్చిమ గోదావరి: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ శ్రీ మామిళ్ళపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఆదివారం భోజన పంపిణి కార్యక్రమం నిర్వహించారు. జనతా కర్ఫ్యూ లోనూ విధులు నిర్వహిస్తున్న పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి, కలెక్టరేట్ సిబ్బందికి, ఆశ వర్కర్స్‌కి సిబ్బందికి అలాగే రోడ్డు ప్రక్కల నిరాశ్రయులకు, బిక్షాటన చేసుకునేవారికి భోజనాన్ని అందించారు. దాదాపు 1000 మందికి ఈ కార్యక్రమం ద్వారా ఆహారాన్ని అందించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ జయప్రకాష్ మాట్లాడుతూ దాతలు శ్రీనివాస్ 600 మందికి, కన్యకా పరమేశ్వరి సత్రం వారు 400 మందికి భోజనాన్ని అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దిరిశాల వరప్రసాద్, రెడ్ క్రాస్ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.



Comments
Please login to add a commentAdd a comment