అన్ని మతాలను కలిపేది రక్తదానం
అన్ని మతాలను కలిపేది రక్తదానం
Published Wed, Jun 14 2017 11:42 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
కర్నూలు(హాస్పిటల్): రక్తదానం అన్ని మతాలు, కులాలను కలుపుతుందని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ చెప్పారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కర్నూలుమెడికల్ కళాశాల సంయుక్తంగా ఆసుపత్రిలోని సీఎల్‌జీలో బుధవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఆసుపత్రికి మంజూరైన రక్తసేకరణ, రవాణా వాహనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో అన్ని మతాల వారిని కలిపేది ఒక్క రక్తదానమేనని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ మాట్లాడుతూ వైద్య కళాశాలలో బ్లడ్ ట్రాన్స్ ఫ్యూషన్ విభాగం ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు.
ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ.. రక్తనిధిలో రక్తం కావాలంటే దాతల సహకారం అవసరమన్నారు. పాథాలజి విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బాలీశ్వరి , రక్తనిధి వైద్యాధికారులు జి.రేవతి, కె.లక్ష్మి, సునీల్‌కుమార్, పీజీ వైద్య విద్యార్థులు, జిల్లా ఎయిడ్స్‌నివారణ, నియంత్రణ విభాగం డీపీఎం అలీ హైదర్, ప్రసాద్, డివి శంకర్, నజీర్‌బాషా తదితరులు పాల్గొన్నారు. రక్తదాతలు, రక్తదాతలను ప్రోత్సహించిన సంస్థలను అభినంది, జ్ఞాపికలు అందించారు.
రక్తదానానికి ముందుకు రావాలి
రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. చే యూత్ ఆర్గనైజేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్‌క్రాస్ రక్తనిధిలో బుధవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ రక్తం గ్రూపులు కనుగొన్న శాస్త్రవేత్త కార్ట్ ల్యాండ్ స్టీనర్ పుట్టిన రోజు సందర్భంగా 2000 సంవత్సరం నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవంత్సరం జూన్ 14వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో రక్తనిధి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement