సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ను దేశవ్యాప్తంగా మరింత వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 24 గంటలూ ప్రజలకు కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి వెల్లడించారు. ప్రజలు వారికి అనుకూలమైన సమయాల్లో వచ్చి వ్యాక్సిన్ తీసుకునేందు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో టీకా వేయడానికి ఉన్న సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు.
అదే విధంగా ప్రజలకు కోవిడ్ టీకాలు వేయడానికి ప్రైవేట్ ఆస్పత్రులు కూడా అన్నివేళల్లో అందుబాటులో ఉంటాయిని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డ్రైవ్‌లో పాల్గొన్న అన్ని ఆస్పత్రులు కోవిన్ యాప్, వెబ్‌సైట్ ద్వారా అనుసంధానం చేయబడినట్లు తెలిపారు. దీంతో అన్ని ఆస్పత్రుల్లో కోవిడ్ వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించడానికి సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. కోవిన్ పోర్టల్‌లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టీకా అందుబాటులో ఉంటుందని నిబంధన ఏమి లేదని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి యాజమాన్యం కోరుకున్న సమయంలో ప్రజలకు టీకాలు అందించే అనుమతి ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment