
సాక్షి, విజయవాడ : లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో అమలవుతుందని డీసీపీ హర్షవర్దన్ తెలిపారు. నిబంధనలు పాటించని వారిని క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నామని పేర్కొన్నారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో కఠిన చర్యలు చేపట్టడంతో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఉంచి పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామని, అనవరసంగా రోడ్లపైకి వచ్చే వారి ద్విచక్రవాహనాలు సీజ్ చేయడంతో కొంత వరకు పరిస్థితిని అదుపుచేశామని అన్నారు. ఇక పడమటలో పోలీసులు ల్యాండ్ మార్చ్ నిర్వహిచి ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలెవరూ ఇళ్లనుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వాలు సూచించే జాగ్రత్తలను ప్రజలందరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు.
(క్వారంటైన్ కేంద్రాలపై నిరంతర పరిశీలన)