
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. గడిచిన 24 గంటలలో మన దేశంలోని మధ్యప్రదేశ్, రాజస్థాన్, న్యూఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, జార్ఖండ్ ఏడు రాష్ట్రాలలో 1,000 లోపు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
అదే విధంగా జమ్ముకశ్మీర్, పంజాబ్, బీహర్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్ అయిదు రాష్ట్రాలలో 2,000 కన్నా తక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు.
కరోనా కట్టడికి వైద్యం, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి హర్షవర్దన్ ఈ వివరాలు వెల్లడించారు. తాజా, లెక్కల ప్రకారం, ఇప్పటి వరకు దేశంలో 2,89,09,975 మంది కరోనా వైరస్‌కు గురికాగా .. 3,49,186 మంది ఈ మహమ్మారి బారిన పడి తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక గత 24 గంటల్లో 1,74,399 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వెల్లడించారు.
చదవండి: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
Comments
Please login to add a commentAdd a comment