న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు ఒక్క రోజు వ్యవధిలో భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వివరాల ప్రకారం.. మంగళవారం 4.40 లక్షల మందిని పరీక్షించగా.. 8,822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. క్రితం రోజు ఆ సంఖ్య 6,594 గా ఉంది. దీంతో ఒక్క రోజు తేడాలో 33 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి.
గడిచిన ఒక్క రోజులో 15 మంది మరణించగా.. ఇప్పటివరకు మొత్తం 5,24 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 98.66 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మరణాల రేటు 1.21 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 195.35 కోట్ల కోవిడ్ టీకాలను కేంద్రం పంపిణీ చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉంది.
చదవండి: Agnipath Recruitment Scheme: రక్షణ శాఖ సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరే వారు తప్పక తెలుసుకోండి
Comments
Please login to add a commentAdd a comment