సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీలో లాక్‌డౌన్‌కు స్వల్ప సడలింపులే ఇవ్వాలని, మహమ్మారిని కట్టడి చేసేందుకు కఠిన నియంత్రణలు అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. లాక్‌డౌన్ సడలింపులకు ఢిల్లీ సిద్ధమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన నేపథ్యంలో ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీలోని కంటెన్మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా సోమవారం నుంచి భారీ సడలింపులు అమలవుతున్న సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కఠిన చర్యలు చేపట్టాల్సిన ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని హర్షవర్ధన్ స్పష్టం చేశారు. ఢిల్లీ పరిస్థితిపై తాను ఏం మాట్లాడినా దాన్ని రాజకీయ ప్రకటనగానే చూస్తారని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో స్వల్ప సడలింపులనే అనుమతించాలని, మహమ్మారి వ్యాప్తి తీవ్రతను బట్టి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర మార్గదర్శకాలను అనుగణంగా వ్యవహరించాలని అన్నారు. దేశ రాజధాని ఢిలీల్లో 4500 కోవిడ్-19 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకూ 64 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. ఢిల్లీలో ఆదివారం అత్యధికంగా 427 తాజా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
Comments
Please login to add a commentAdd a comment