
ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ.. నాసిరకం కరోనా టెస్ట్ కిట్లను వెనక్కి తిప్పి పంపిస్తామన్నారు. చైనా కంపెనీలకు టెస్ట్ కిట్ల డబ్బులు చెల్లించలేదన్నారు. కేంద్ర బృందాలనేవి రాష్ట్రాలకు సహకరించడం కోసమే తప్ప పర్యవేక్షణ కోసం కాదన్నారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా బారినపడ్డ వారిలో మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు మన దేశంలో బాగుందని హర్ష వర్దన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 700 దాటేసింది.
(కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం)
Comments
Please login to add a commentAdd a comment