మరోసారి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ | Narendra Modi Holds Video Conference With States Cms On June16 And 17 | Sakshi
Sakshi News home page

కరోనా: మరోసారి సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

Published Fri, Jun 12 2020 8:52 PM | Last Updated on Fri, Jun 12 2020 9:53 PM

Narendra Modi Holds Video Conference With States Cms On June16 And 17 - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ అధికమవుతోంది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకోవడంతో తాజాగా భారత్ బ్రిటన్‌ను కూడా‌ బీట్‌ చేసి నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ధోరణి కొనసాగితే కొద్ది రోజుల్లోనే మన దేశం మొదటి స్థానాన్ని ఆక్రమిస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కోవిడ్‌, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజులపాటు ప్రధాని సీఎంలతో వర్చువల్‌ సమావేశాల్లో పాల్గొంటారని పీఎం కార్యాలయం శుక్రవారం తెలిపింది. ఈ నెల 16, 17 వ తేదీల్లో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లు ఉంటాయని వెల్లడించింది. కరోనా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయడంతోపాటు, వైరస్‌ కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలపై  ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నట్టు తెలుస్తోంది. మరోసారి లాక్‌డౌన్‌ విధించాలా అన్న విషయాలూ చర్చించే అవకాశం ఉంది. (పరీక్షా కాలాన్ని ఎదుర్కొంటున్నాం: మోదీ)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement