state health minister
-
సహజ ప్రసవాలు పెంచండి
జహీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో గుణాత్మకమైన మార్పులను తీసుకొచ్చిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ప్రభుత్వాస్పత్రిలో మహీంద్ర ఆధ్వర్యంలో రూ.1.05 కోట్లతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ఇప్పటివరకు 86 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు ఏర్పా టు చేసినట్టు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కోసం నానాకష్టాలు పడాల్సి వచ్చిందని, ఇది గమనించిన సీఎం కేసీఆర్ 550 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించార న్నారు. ప్రస్తుతం 350 మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి చేరుకున్నామని, మరో 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజ న్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్ ఏర్పాటుచేసేం దుకు అగ్రిమెంట్ చేసుకున్నా మన్నారు. రాష్ట్రవ్యా ప్తంగా ఉన్న ప్రభుత్వాస్ప త్రుల్లోని 27 వేల పడక లకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని, ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండబోదని చెప్పారు. కేసీఆర్ కిట్‌తో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయని, ప్రస్తుతం 52 శాతం డెలివ రీలు జరుగుతున్నాయని, దీనిని 75 శాతానికి పెం చాలని వైద్యులకు సూచించారు. దేశంలో పేదలకు ఉత్తమ వైద్య సేవలు అందించే విషయంలో తెలంగాణ మూడోస్థానంలో ఉందని, త్వరలోనే మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేస్తున్నామన్నారు. అనంత రం హోతి(బి) గ్రామంలో మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్ ఫాతిహా చాహేలుమ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన కుమారుడు తన్వీర్‌తో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. -
'రికవరీ రేటు మన దేశంలో చాలా బాగుంది'
ఢిల్లీ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ శుక్రవారం అన్ని రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులతో కరోనా పై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్దన్ మాట్లాడుతూ.. నాసిరకం కరోనా టెస్ట్ కిట్లను వెనక్కి తిప్పి పంపిస్తామన్నారు. చైనా కంపెనీలకు టెస్ట్ కిట్ల డబ్బులు చెల్లించలేదన్నారు. కేంద్ర బృందాలనేవి రాష్ట్రాలకు సహకరించడం కోసమే తప్ప పర్యవేక్షణ కోసం కాదన్నారు. ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలో కరోనా వ్యాప్తి చాలా తక్కువగా ఉందన్నారు. కరోనా బారినపడ్డ వారిలో మిగతా దేశాలతో పోలిస్తే రికవరీ రేటు మన దేశంలో బాగుందని హర్ష వర్దన్ వెల్లడించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 700 దాటేసింది. (కరోనా ఎఫెక్ట్ : ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంచలనం) -
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి
రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి కామినేని కడప అర్బన్ : ప్రజారోగ్యాన్ని ద ృష్టిలో ఉంచుకుని అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖమంత్రి కామినేని శ్రీనివాస్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సీజనల్ వ్యాధులపై ముందస్తు చర్యల కోసం మంత్రులు జిల్లా కలెక్టర్‌తో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణలో జాగ్రత్త వహించాలని, ఇందులో ఎలాంటి రాజీకి ఆస్కారం లేదన్నారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందువల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. వీటి నివారణకు అత్యంత ప్రాధాన్యతతో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అందించే తాగునీటిలో క్లోరినేషన్ సమపాళ్లలో చేయాలన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టాలని ఆదేశించారు. నీటి పైపులైను లీకేజీ లేకుండా చూడాలన్నారు. పట్టణ, గ్రామాలలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. పంచాయతీ ,ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలు మాట్లాడుతూ దోమకాటు, నీటి కలుషితం వల్ల వచ్చే వ్యాధుల కారణంగా డయేరియా, కామెర్లు, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. కలెక్టర్ కేవీ రమణ, ఏజేసీ సుదర్శన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మాల్యాద్రి, డీఎంహెచ్ఓ డాక్టర్ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.