హర్షవర్దన్.. డైరెక్టర్‌గా కంటే కూడా అమృతం సీరియల్ నటుడిగా ఎక్కువమందికి సుపరిచితం. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపైనా ఎన్నో చిత్రాల్లో నటించాడు. గుండెజారి గల్లంతయ్యిందే, మనం, గురు వంటి సినిమాలకు డైలాగులు రాశాడు. ఇటీవల రిలీజైన మామా మశ్చీంద్ర సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ ఇది బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
ఇకపోతే 49 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉంటున్నాడు హర్ష వర్ధన్. తను ఒంటరిగా ఉండటానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. 'నా లైఫ్ స్టైల్‌కు పెళ్లి అనేది పడదు. నేను అందరితోనూ స్నేహంగా ఉంటాను. ఉన్న కాసేపు చాలా బాగా మాట్లాడతాను. అలా అని పార్టీలకు గట్రా వెళ్లను. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాను. వేరేవాళ్లకు ఎక్కువ సమయం ఇవ్వడం, వాళ్లకు నచ్చినట్లుగా ఉండటం అనేది కష్టం. నేనసలు నా కుటుంబ బాధ్యతలనే సరిగా పట్టించుకోను.
నేను పెళ్లి చేసుకుంటే భార్యను వదలను, వేరే అమ్మాయిని కన్నెత్తి చూడను, పిల్లలను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను. వాళ్లు చనిపోయేవరకు నేను బతికుండాలి.. ఎందుకంటే వారికోసం కష్టపడాలి, వాళ్లకు రక్షణ కవచంగా ఉండాలి! అని ఆరాటపడతాను. అయినా పెళ్లి అనేది తోడు కోసం అంటారు. కానీ, అది ఒక ఇన్సూరెన్స్ పాలసీ, బిజినెస్ డీల్. మనకు చేతకానప్పుడు భార్యాపిల్లలు చూసుకుంటారు. మన పనులన్నీ చేసిపెడతారంతే!
నాకు కూడా గతంలో రిలేషన్స్ ఉన్నాయి. పెళ్లి కోసం అమ్మాయిల వెంటపడ్డాను కూడా! ఒకమ్మాయైతే బ్రేకప్ అయ్యాక కూడా అప్పుడప్పుడూ మెసేజ్‌లు చేస్తూ ఉంటుంది. నా మంచి చెడూ చూసేందుకు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక జీవితమంతా ఆడుతూ పాడుతూ సింగిల్‌గా బతికేస్తాను' అని చెప్పుకొచ్చాడు హర్ష వర్ధన్.
చదవండి: బిగ్‌బాస్ 7 మినీ లాంచ్‌లో నాగ్ వేసుకున్న షర్ట్ ధరెంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment