
నూతన వైద్య కళాశాలలకు త్వరలో ఎంసీఐ బృందం
రాయచూరు, గుల్బర్గ, కొప్పళ జిల్లాలలోని నూతన వైద్య కళాశాలలను త్వరలో ఎంసీఐ బృందం సందర్శిస్తుందని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి శరణుప్రకాష్ పాటిల్ తెలిపారు.
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాయచూరు, గుల్బర్గ, కొప్పళ జిల్లాలలోని నూతన ైవైద్య కళాశాలలను త్వరలో ఎంసీఐ బృందం సందర్శిస్తుందని జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర ైవైద్య విద్యా శాఖ మంత్రి శరణుప్రకాష్ పాటిల్ తెలిపారు. ఆయన శనివారం నగరంలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ైవైద్య కళాశాలలో విద్యార్థుల ప్రవేశానికి అనుమతి కోరుతామన్నారు. బీదర్ వైద్య కళాశాలలో జరిగిన అవీనితిపై విచారణ జరిపిస్తామన్నారు.
ఓపెక్ ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి స్వయం ప్రతిపత్తితో వ్యవవహరించే కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకుచర్యలు చేపట్టామన్నారు. విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు ప్రతాప్ గౌడ పాటిల్, హంపనగౌడ, వెంకటేశ నాయక్, రాయచూరు డీసీసీ అధ్యక్షుడు వసంతకుమార్, పార్టీ నాయకుడు బివి.నాయక్ ఉన్నారు