సాక్షి, అమరావతి: నాలుగేళ్లలో 53 వేలకు పైగా వైద్య పోస్టులను భర్తీ చేసిన చరిత్ర మన రాష్ట్రంలో గతంలో ఎప్పుడైనా ఉందా? మన కళ్లెదుటే స్పెషలిస్టు డాక్టర్లు, కొత్త మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. ఎప్పటి ఖాళీలు అప్పుడే భర్తీ అవుతున్నాయి. అసలు ఖాళీల భర్తీకే ప్రత్యేకంగా మెడికల్ సర్వీసెస్ బోర్డు ఏర్పాటైందంటే వైద్య ఆరోగ్య రంగంపై ప్రభుత్వం ఎంత శ్రద్ధ వహిస్తోందో వేరే చెప్పాలా? అయినా సరే చీకటి ఒప్పందాలు కుదుర్చుకుని కాకమ్మ కధలు అల్లే రామోజీని ఏమనుకోవాలి?
‘కాంట్రాక్ట్’ క్రమబద్ధీకరణ.. ఏపీ వీవీపీ విలీనం
టీడీపీ అధికారంలో ఉండగా ఐదేళ్లలో చంద్రబాబు అతి కష్టమ్మీద వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేసింది కేవలం 1,693 పోస్టులు. ప్రభుత్వాస్పత్రుల వైపు చూడాలంటేనే జనం జంకే పరిస్థితి కల్పించారు. మానవ వనరుల కొరత తీవ్రంగా వేధిస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పేదలకు ప్రైవేట్ వైద్యాన్నే దిక్కుగా మార్చేశారు. ఇలాంటి దుస్థితిలో ఉన్న వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ సీఎం జగన్ ఏకంగా 53,126 పోస్టులను భర్తీ చేసి జవసత్వాలు చేకూర్చారు. వైద్య రంగంలో మన రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా మార్చారు.
వైద్య శాఖలో ఏ ఒక్క పోస్టు ఖాళీ ఏర్పడినా ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే వెంటనే భర్తీ చేసేలా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అత్యవసర ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య శాఖ నియామకాల కోసమే ప్రత్యేకంగా ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ను ఏర్పాటు చేసింది. ఇది గొప్ప ప్రగతిశీల చర్యగా కేంద్ర ప్రభుత్వం సైతం ప్రశంసించింది. పీహెచ్‌సీల్లో వైద్యులు ఎవరైనా దీర్ఘకాలిక సెలవుపై వెళితే సేవలకు అంతరాయం కలగకుండా జిల్లాకు నలుగురు చొప్పున 114 మంది డాక్టర్లను సిద్ధంగా ఉంచగా తాత్కాలిక సెలవుపై వెళ్లిన చోట విధులు నిర్వర్తించేందుకు 175 మంది చొప్పున పూల్ అప్ వైద్యులను అందుబాటులో ఉంచారు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్పెషలిస్ట్ వైద్యుల కొరత 61 శాతం కాగా మన రాష్ట్రంలో కేవలం 5 శాతానికే పరి మితమైంది. వైద్య శాఖలో 2014కు ముందు ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు వీలుగా ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. ఏపీ వైద్య విధాన పరిషత్‌ను ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా వేల మంది ఉద్యోగులకు భద్రత కల్పించింది.
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లకు (ఎంఎల్‌హెచ్‌పీ) దేశంలో ఎక్కడా లేనివిధంగా పారి
తోషికం చెల్లిస్తోంది. పనితీరును అంచనా వేసి అదనంగా రూ.15 వేల వరకూ ప్రోత్సాహకం అందిస్తోంది. ప్రోత్సాహకంతో కలిపి గరిష్టంగా రూ.40 వేల వరకూ వేతనా లను చెల్లిస్తోంది. మరి ఇలాంటి చర్యలు చంద్రబాబు ప్రభుత్వంలో రామోజీ ఎప్పుడైనా చూశారా? కనీసం ఇప్పుడైనా తెలుసుకుంటున్నారా?
Comments
Please login to add a commentAdd a comment