ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు | 17 New Medical Colleges Started By CM YS Jagan Government - Sakshi
Sakshi News home page

ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు

Published Fri, Sep 15 2023 4:55 AM | Last Updated on Fri, Sep 15 2023 5:16 PM

17 new medical colleges started by YSRCP government - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధా­న్య­మిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌­మోహన్‌­రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్‌ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆద­ర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్‌ విధా­నంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలి­సిందే.

ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం ప్రారంభించను­న్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యా­యా­­నికి నాంది పలుకు­తు­న్నారు. విజయ­నగరం, ఏలూ­రు, రాజమహేంద్ర­వ­రం, మచిలీప­ట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటై­న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజ­యనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు.

జిల్లాకు ఒకటి చొప్పున
ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవే­రుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్‌ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 

17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు
రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మి­షన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్‌ కళాశాలలను  ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది.

మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు
రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరు­వాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు సమకూ­రాయి. అంటే 2,185 సీట్లు సమకూర­డానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్‌ సీట్లను సీఎం జగన్‌ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్‌ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి.

చాలా అద్భుతంగా ఉన్నాయి
అత్యాధునికంగా మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్‌ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్‌ హాల్స్, లెక్చర్‌ హాల్స్‌ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నా­యి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌­లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభు­త్వం కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేయక­పోయి ఉంటే మేం ప్రైవేట్‌ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల

గొప్ప వరంలా భావిస్తున్నా
మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్‌లో కొంత మెరుగైన ర్యాంక్‌ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమ­య్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్‌ దక్కింది. లేదంటే మళ్లీ నీట్‌ లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది.  కార్పొరేట్‌ వైద్య కళాశా­లలకు ధీటుగా మా మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళా­శాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తు­న్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల

రెండు రకాల లాభాలు..
వైద్యవిద్య డిమాండ్‌కు త­గ్గట్టుగా రాష్ట్రంలో కళాశా­లలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళు­తున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతు­న్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రు­లున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నా­యి. వైద్య సేవలు, రోగ­ని­ర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగు­తుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్‌

ఉన్నత స్థాయి వైద్యం
కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనా­స్ప­త్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్‌ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందు­తాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవు­తాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్ప­త్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్‌ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు

ఉన్న చోటే వైద్య విద్యలో చేరా..
ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశా­లను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్‌ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగ­తులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్‌ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్‌ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల

నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా..

  • నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు  అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఏర్పాటు.  
  • రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వా­లు.
  •  గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు.
  • దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు.  
  •  ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా.
  • టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం.
  • 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి.
  • పీజీ మెడికల్‌ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.
  •  జాతీయస్థాయిలో స్పెషలిస్ట్‌ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. 
  • వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు
  •   గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్స­ర్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు దిశగా అడు­గు­లు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement