
సాక్షి, పల్నాడు: దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవం కోసం గురువారం పల్నాడులో పర్యటించిన ఆయన.. లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీడాక్టర్ విధానం నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్ దేశ చరిత్రలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం జగన్ ఆకాంక్షించారు.
డాక్టర్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు. విలేజ్ క్లినీక్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశావర్కర్లు ఉంటారు.
ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్ ఉంటుంది. మండలానికి రెండు పీహెచ్‌సీలు. ప్రతీ పీహెచ్‌సీలు ఇద్దరు వైద్యులు ఉంటారు. ఒకరు పీహెచ్‌సీలో ఉంటే.. మరొకరు ఆంబులెన్స్‌లో తిరుగుతుంటారు. వైఎస్‌ఆర్ విలేజ్‌క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారాయన. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని పేర్కొన్నారు.
అన్ని వైద్య సేవలు గ్రామంలో ఇంటి ముంగిటే అందించే గొప్ప పథకం ఇది. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తాం. మందులు ఉచితంగా అందించే గొప్ప కాన్సెప్ట్ ఈ ఫ్యామిలీ డాక్టర్ అని సీఎం జగన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment