Lingamguntla Circle
-
ప్రతి పేద వ్యక్తికి అండగా నిలవాలని ఫ్యామిలీ డాక్టర్: సీఎం జగన్
-
ఫ్యామిలీ డాక్టర్ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుంది: సీఎం జగన్
సాక్షి, పల్నాడు: దేశంలో గొప్ప మార్పునకు లింగంగుంట్ల నుంచి శ్రీకారం చుట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రారంభోత్సవం కోసం గురువారం పల్నాడులో పర్యటించిన ఆయన.. లింగంగుంట్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీడాక్టర్ విధానం నేటి నుంచి ప్రారంభిస్తున్నాం. దేశచరిత్రలోనే వైద్యసేవల విధానంలో నూతన విధానానికి శ్రీకారం చుట్టాం. ఈ కాన్సెప్ట్ దేశ చరిత్రలోనే రోల్ మోడల్‌గా నిలుస్తుందని సీఎం జగన్ ఆకాంక్షించారు. డాక్టర్ కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆస్పత్రులు, డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఫ్యామిలీ డాక్టర్‌తో వ్యాధులు ముదరకముందే గుర్తించవచ్చు. విలేజ్ క్లినీక్‌లో సీహెచ్‌వో, ఏఎన్ఎం, ఆశావర్కర్లు ఉంటారు. ప్రతీ 2వేల జనాభాకు ఓ క్లినిక్ ఉంటుంది. మండలానికి రెండు పీహెచ్‌సీలు. ప్రతీ పీహెచ్‌సీలు ఇద్దరు వైద్యులు ఉంటారు. ఒకరు పీహెచ్సీలో ఉంటే.. మరొకరు ఆంబులెన్స్‌లో తిరుగుతుంటారు. వైఎస్ఆర్ విలేజ్‌క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానిస్తాం. వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని అన్నారాయన. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు, బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని పేర్కొన్నారు. అన్ని వైద్య సేవలు గ్రామంలో ఇంటి ముంగిటే అందించే గొప్ప పథకం ఇది. మంచానికే పరిమితమైన రోగులకు ఇంటి వద్దే వైద్యం అందిస్తాం. మందులు ఉచితంగా అందించే గొప్ప కాన్సెప్ట్ ఈ ఫ్యామిలీ డాక్టర్ అని సీఎం జగన్ తెలిపారు. -
దారుణం: ఏడేళ్ల బాలుడిని చంపేసిన చిన్నమ్మ
సాక్షి, గుంటూరు : జిల్లాలోని లింగంగుంట్లలో దారుణం చోటు చేసుకుంది. కరిముల్లా అనే ఏడేళ్ల బాలుడిని పిన్ని వరుస అయ్యే ఓ మహిళ అతి కిరాతంగా హత్య చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంగుంట్లకు చెందిన ఓ మహిళ, చీరాలలో ఓ శుభ కార్యానికి వెళ్తూ తన ఏడేళ్ల కుమారుడు కరిముల్లాను చెల్లెలు ఆసియాకు అప్పజెప్పింది. ఈ క్రమంలో ఆసియా కత్తితో కరిముల్లాపై దాడి చేసింది. బాలుడి పొట్టకోసి హత్య చేసింది. అనంతరం రక్తాన్ని ముఖానికి పూసుకొని బయటకు పరుగులు తిసింది. స్థానికులపై కత్తితో దాడికి యత్నించగా, పట్టుకొని చేతులు కట్టేశారు. అనంతరం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఇంటికి తిరిగి వచ్చిన బాలుడి తల్లిదండ్రులు.. విగతజీవిగా పడిఉన్న కుమారుడిని చూసి బోరున విలపించారు. కొంతకాలంగా ఆసియాకు మతిస్థిమితం లేదని స్థానికులు చెబుతున్నారు. -
ఇక్కడ నీళ్లు...అక్కడ నిర్వహణ
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా... సాగు, తాగు నీరు విడుదల చేయాలంటే... ఆంధ్రప్రదేశ్ పరిధిలోని లింగంగుంట్ల సర్కిల్ నీటిపారుదల అధికారులు ఆదేశాలు జారీ చేస్తేనే...మాచర్ల సబ్‌డివిజన్ నుంచి సిబ్బంది వచ్చి గేట్లు ఎత్తాల్సి ఉంటుంది. దీనికంతటికీ క్యాంప్స్అండ్ బిల్డింగ్, గేట్స్, నీటిసరఫరా సబ్డివిజన్లను గుంటూరు జిల్లా పరిధిలోని లింగంగుంట్ల సర్కిల్‌కు అటాచ్ చేయడమే కారణం. ఆయా డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న 86మంది ఉద్యోగులను ఎన్ఎస్పీ సీఈ మాచర్ల సబ్‌డివిజన్‌లోకి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది జరిగి మూడు నెలలు అవుతోంది. నాటి నుంచి ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ర్ట పరిధిలోనే ఉంటామంటూ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావును కూడా కలిశారు. ఆయన ఇరిగేషన్ కార్యదర్శి నాగిరెడ్డిని సమస్య పరిష్కరించమని ఆదేశించారు. నాటి నుంచి ఉద్యోగులు రెండు రాష్ట్రాల కార్యదర్శుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. డ్యాం నిర్మాణ సమయం నుంచి తెలంగాణ ప్రాంతంలోనే ఉంటున్నామని, ఇక్కడే జీతాలు తీసుకుంటున్నామని ఉద్యోగులు మొర పెట్టుకోవడంతో జీతాలు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. కృష్ణారివర్‌బోర్డు ఏర్పడేంతవరకు డ్యాంనిర్వహణతో పాటు గేట్లనిర్వహణ కార్యాలయాలు ఇక్కడే ఉండేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంతలోనే లింగంగుంట్ల సర్కిల్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటని, ఉద్యోగులు, సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.