ఇది గతం..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గ్రామంలో ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యానికి జిల్లా ఆస్పత్రికో లేదా ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లాల్సిందే. వైద్య సదుపాయం ఉన్న గ్రామాలే తక్కువ. అక్కడ వైద్యుడు ఉంటాడన్న నమ్మకం లేదు.
ప్రాంతీయ ఆస్పత్రులూ అంతంతమాత్రమే. అక్కడా వైద్యులు ఉండరు. దీంతో వృద్ధులైనా, మహిళలైనా, దివ్యాంగులైనా వ్యయప్రయాసలకోర్చి జిల్లా ఆస్పత్రికో, ప్రైవేటు ఆస్పత్రికో వెళ్లక తప్పని పరిస్థితి. అక్కడా పెద్ద క్యూలు. ఉండేదే అరకొర వైద్య సిబ్బంది. ఆరోజు తమను చూస్తారో లేదోనన్న ఆందోళన.
నేడు గ్రామాలకే వైద్యులు..
ఇప్పుడున్నది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తున్న సీఎం వైఎస్ జగన్.. గ్రామాల్లోని ఆస్పత్రుల నుంచి జిల్లా ఆస్పత్రుల వరకు అధునాతనంగా తీర్చిదిద్దుతున్నారు. అంతే కాదు.. గ్రామీణ ప్రజలు చిన్న సమస్యలకు కూడా పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులనే గ్రామాలకు పంపిస్తున్నారు.
ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ‘ఫ్యామిలీ డాక్టర్’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు గ్రామీణులెవరూ వైద్యం కోసం పరుగులు పెట్టాల్సిన అవసరంలేదు. వారి వద్దకే వైద్యులు వస్తున్నారు. వారి ఆరోగ్యాన్ని పరీక్షించి, పరీక్షలు చేసి, అవసరమైన మందులు కూడా ఇస్తున్నారు.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కోసం సీఎం వైఎస్ జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమం ‘ఫ్యామిలీ డాక్టర్’. ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యులు వెళ్లే ఈ కార్యక్రమాన్ని 2022 అక్టోబర్ నెలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నారు. ట్రయల్ రన్ మొదలు పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు 15 నెలల్లో రికార్డు స్థాయిలో 3.15 కోట్ల వైద్య సేవలు అందించారు.
ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు మండలానికి రెండు పీహెచ్‌సీలు ఉండేలా ప్రస్తుతం ఉన్న 1142 పీహెచ్‌సీలకు అదనంగా 88 కొత్త వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మండలంలో ఒక పీహెచ్‌సీ, సీహెచ్‌సీ ఉన్న 63 చోట్ల వైద్యులను నియమించింది. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులకు వారి పరిధిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లను సమానంగా విభజించారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,032 విలేజ్ క్లినిక్‌లను వైద్యులు నెలలో రెండుసార్లు సందర్శిస్తున్నారు. 104 మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ)లతో పాటు వైద్యులు గ్రామాలకు వెళుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఉన్న 676 ఎంఎంయూలకు అదనంగా 260 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ 104 యూనిట్, వైద్యుడు గ్రామానికి వెళ్లిన రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ప్రజలకు అవుట్‌పేòÙంట్ సేవలు అందిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మంచానికే పరిమితమైన రోగుల ఇళ్లకు వెళ్లి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు.
అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి పిల్లల ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇక నాన్ కమ్యూనికబుల్ డీసీజెస్ (ఎన్‌సీడీ) సర్వేలో భాగంగా 30 ఏళ్లు పైబడిన వారందరినీ వైద్య శాఖ స్క్రీనింగ్ చేస్తోంది. వీరిలో బీపీ, షుగర్, ఇతర సమస్యలు ఉన్న వారికి నిర్దేశించిన ప్రమాణాలతో మెడికల్ ఫాలోఅప్ చేస్తూ ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరం సాధారణంగా బీపీ, షుగర్, ఇతర ధీర్ఘకాలిక వ్యాధిగ్రçÜ్తులు క్రమం తప్పకుండా మందులు వాడటంతో పాటు, వైద్యులను సంప్రదిస్తూ ఉండాలి. మారుమూల గ్రామాల్లో ఉండే వారు ప్రతి నెలా వైద్యుడిని సంప్రదించాలంటే 4 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండే పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలకు వెళ్లాలి. ఆస్పత్రికి వెళ్లి రావడానికి ప్రయాణ చార్జీలతో పాటు, ఒక రోజంతా కేటాయించాలి. మంచానికే పరిమితమైన వారిని ఆస్పత్రులకు తీసుకెళ్లాలంటే ఆ కుటుంబాలు పడే కష్టాలు వర్ణనాతీతం.
ఈ కష్టాలకు చెక్ పెడుతూ సీఎం వైఎస్ జగన్ వైద్యులనే ప్రజల వద్దకు పంపుతున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వరంగా మారింది. విలేజ్ క్లినిక్‌లలోనే 105 రకాల మందులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. థైరాయిడ్, గుండె సంబంధిత, ఇతన సమస్యలకు మందులు గ్రామస్థాయిలోనే అందుబాటులో ఉంటున్నాయి.
‘ఫ్యామిలీ డాక్టర్’తో గ్రామాల్లో అందే వైద్య సేవలు
♦ జనరల్ అవుట్ పేషెంట్ సేవలు
♦ బీపీ, షుగర్, ఊబకాయం లాంటి జీవనశైలి జబ్బుల కేసుల ఫాలోఅప్
♦ గర్భిణులకు యాంటినేటల్ చెకప్స్, బాలింతలకు పోస్ట్‌నేటల్ చెకప్స్, ప్రసవానంతర సమస్యల ముందస్తు గుర్తింపు.
♦ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన రోగులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారికి, వృద్ధులకు ఇంటి వద్దే వైద్యం
♦ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాల గుర్తింపు
♦ తాగునీటి వనరుల్లో క్లోరినేషన్ నిర్ధారణ
♦ పాలియేటివ్ కేర్
♦ రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్న పిల్లలకు వైద్య సేవలు
గ్రామాల్లోనే 14 రకాల వైద్య పరీక్షలు
♦ గర్భం నిర్ధారణకు యూరిన్ టెస్ట్
♦ హిమోగ్లోబిన్ టెస్ట్
♦ ర్యాండమ్ గ్లూకోజ్ టెస్ట్ (సుగర్)
♦ మలేరియా టెస్ట్
♦ హెచ్‌ఐవీ నిర్ధారణ
♦ డెంగ్యూ టెస్ట్
♦ మల్టీపారా యూరిన్ స్ట్రిప్స్ (డిప్ స్టిక్)
♦ అయోడిన్ టెస్ట్
♦ వాటర్ టెస్టింగ్
♦ హెపటైటిస్ బి నిర్ధారణ
♦ ఫైలేరియాసిస్ టెస్ట్
♦ సిఫ్లిస్ ర్యాపిడ్ టెస్ట్
♦ విజువల్ ఇన్‌స్పెక్షన్
♦ స్పుటమ్ (ఏఎఫ్‌బీ)
Comments
Please login to add a commentAdd a comment